Actress Hema: నేను సింహం.. మీరంతా గుంటనక్కలు.. మరోసారి శివాలెత్తిన నటి హేమ..

Bengaluru rave party: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో నటి హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చాలా మంది అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని, దీనిపైన న్యాయపోరాటం చేస్తానంటూ తెల్చిచెప్పారు. 

Written by - Inamdar Paresh | Last Updated : May 26, 2024, 01:38 PM IST
  • రేవ్ పార్టీ ఘటనపై మండి పడిన నటి హేమ..
  • వారిపై లీగల్ గా ముందుకు వెళ్తానంటూ వ్యాఖ్యలు..
Actress Hema: నేను సింహం.. మీరంతా గుంటనక్కలు.. మరోసారి శివాలెత్తిన నటి హేమ..

Hema Hot comments on Bengaluru rave party allegations: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలనో నటి హేమ కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు తనపై కావాలని అసత్యమైన ఆరోపణలు, ప్రచారాలు చేస్తున్నారని నటి హేమ అన్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి తన కుటుంబం కంటి నిండా నిద్ర, కడుపు నిండా అన్నం కూడా తినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై ఖచ్చితంగా న్యాయపోరాటాం చేస్తానంటూ స్పష్టం చేశారు. సింహం ఒక అడుగు వెనుక వేస్తే, అది తగ్గినట్లు కాదని, గుంట నక్కలకు సరైన విధంగా సమాధానం చెప్తానంటూ కూడా శివాలెత్తిపోయారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఉన్నప్పుడు ఎందరి కోసమో తాను పోరాటం చేశానని, అలాంటి తనమీద ఆరోపణలు వస్తే ఊరుకుంటానా.. అంటూ ఫైర్ అయ్యారు. కానీ గతంలో మాదిరిగా  ఇప్పుడు ఆవేషంతో మాట్లాడనని చెప్పుకొచ్చారు. తనపై నోటీసులు జారీ చేసిన బెంగళూరు పోలీసుల మీద కూడా లీగల్ గానే ముందుకు వెళ్తానంటూ తెల్చిచెప్పారు.

Read more: Romantic Dance: క్లాస్ లో టీచర్ తో స్టూడెంట్ రోమాంటిక్ డ్యాన్స్... చూస్తే తట్టుకోలేరు.. వీడియో వైరల్..

ఇదిలా ఉండగా.. నటి హేమ మొదటి నుంచి కూడా  బెంగళూర్ రేవ్ పార్టీలో పాల్గొనలేదని చెప్పినట్లుగానే, ఈసారి కూడా కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. ఇక సోమవారం మే 27 న తమ ముందు హజరు కావాలని బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై నటి హేమ రేపు బెంగళూరు వెళ్తానని, పోలీసుల ముందు హజరై తన వాదనను చెప్పుకుంటారని తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మంచు విష్ణు స్పందించారు. నేరం రుజువయ్యే వరకు కూడా ఆమె నిరపరాధే నంటూ క్లారిటీ ఇచ్చారు. ఒకరిని ఇబ్బందులు పెట్టడం మానుకొవాలని కోరారు. అసత్యం ప్రచారాలు చేయోద్దని అన్నారు.

ఒక వేళ నటి హేమ తప్పుచేసినట్లు రుజువైతే.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఆమెపై చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మా అసోసియేషన్ ఇలాంటి ఘటనలపై సీరియస్ గా చర్యలు తీసుకుంటుందని మంచు విష్ణు తెల్చిచెప్పారు. ఇదిలా ఉండగా.. బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ దొరికారని తొలుత ప్రచారం జరిగింది.ఆ తర్వాత ఆమె తన ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని వీడియో పెట్టారు.

Read more: Drunken couple: తప్పతాగి రోడ్డు మీద హల్ చల్.. వాకర్స్ మీద రెచ్చిపోయిన యువతి.. వీడియో వైరల్..

అంతేకాకుండా.. బిర్యానీ చేస్తున్నట్లు మరో వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్స్ చేశారు. చివరకు ఆమె బెంగళూరు పోలీసులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. నటి హేమ తన పేరును కృష్ణవేణి అని చెప్పుకుందని అన్నారు. అంతేకాకుండా..హేమ రేవ్ పార్టీలో ఉన్నట్లు ఫోటో రిలీజ్ చేశారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు బైటపడటంతో  తమ ముందు హజరు కావాలని బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News