తెలంగాణలో నైట్ కర్ఫ్యూ అమలవుతున్నా కరోనా వైరస్ సెకండ్ వేవ్‌ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్నా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో తాజాగా 6,876 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,63,361కి చేరింది. ఈ మేరకు తెలంగాణ(Telangana Corona Bulletin) వైద్య,ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం కరోనా అప్‌డేట్ అందించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం రాత్రి 8 వరకు గడిచిన 24 గంటల్లో 70,961 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 6 వేల 8 వందల 76 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కోవిడ్19 పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షల 63 వేల 3 వందల 61కు చేరింది. కరోనా(CoronaVirus)తో పోరాడుతూ రాష్ట్రంలో మరో 59 మంది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా మరణాలు 2,476కి చేరింది. 


Also Read: Bill Gates Divorce: విడాకులు తీసుకుంటున్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, మెలిండా


తాజా కేసులలో GHMC పరిధిలోనే 1,029 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపితే తెలంగాణలో ప్రస్తుతం 79 వేల 520 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకూ 1.31 కోట్ల శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు. తెలంగాణలో నిన్న ఒక్కరోజు చికిత్స అనంతరం కోవిడ్-19 బారి నుంచి 7,432 మంది కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,81,365 మంది కరోనా మహమ్మారిని జయించారు. రాష్ట్రంలో కరోనా బారి నుంచి కోలుకుంటున్న వారు 82.30 శాతం ఉన్నారు. జాతీయ సగటు 81.8 శాతంగా ఉంది.


తెలంగాణలో ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకాల(Covid-19 Vaccine) ప్రక్రియ కొనసాగుతోంది. యువతీయువకులకు ఇచ్చేందుకు టీకాలు లేని పరిస్థితి పలు జిల్లాల్లో కనిపిస్తోంది. కానీ కరోనా టీకాల వివరాలు తెలుసుకునేందుకు టీకా కేంద్రాలకు యువతీయువకులు తరలి వస్తున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ అదనంగా ఆరోగ్యశాఖ తీసుకున్న అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా టెస్టులు తగ్గించడంతో పాజిటివ్ కేసులు తగ్గినట్లు తెలుస్తోంది. కోవిడ్19 నిబంధనలు పాటించడం, కరోనా టీకాలు తీసుకోవడం మాత్రమే మహమ్మారిని ఎదుర్కొనేందుకు మార్గాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.


Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో పుంజుకున్న బంగారం ధరలు, వెండి ధరలు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook