Telangana: తెలంగాణలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. కరోనా కారణంగా విద్యాసంవత్సరం నష్టపోవడంతో మార్పులు చేర్పులతో పాటు..ఆలస్యంగా జరగనున్నాయి పరీక్షలు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ ( Corona virus ) కారణంగా 2020-21 విద్యాసంవత్సరాన్ని విద్యార్ధులు నష్టపోయారు. అటు 2019-20 విద్యాసంవత్సరం కూడా పరీక్షలు లేకుండానే ముగిశాయి. ఇప్పుడు 2020-21 విద్యాసంవత్సరంలో క్లాసులు సరిగ్గా జరగని కారణంగా పదవ తరగతి పరీక్షల్లో మార్పులు చేశారు. కేవలం ఆరు పేపర్లలోనే పరీక్షలు నిర్వహించనున్నట్టు టీఎస్‌ ఎస్ఎస్‌సీ బోర్డు ( TS SSC Board ) వెల్లడించింది. దీనికి సంబంధించిన తెలంగాణ పదవ తరగతి పరీక్షల టైమ్ టేబుల్ ( Telangana 10th Exams time table )‌ను విడుదల చేసింది. మే 17 నుంచి 26వ తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల్నించి మద్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. 


తెలంగాణ పదవ తరగతి టైమ్ టేబుల్


మే 17... తెలుగు పరీక్షతో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 18వ తేదీన హిందీ, మే 19న ఇంగ్లీష్‌, మే 20న మ్యాథ్స్‌, మే 21న సైన్స్‌, మే 22న సోషల్‌ పరీక్షలు జరుగుతాయని ఎస్‌ఎస్‌సీ బోర్డు తెలిపింది. 


Also read: EWS Reservation: ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరెవరు పొందవచ్చు, ఈ కండీషన్స్ తెలుసుకోండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook