TG TET Hall Tickets: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
TG TET Hall Tickets: తెలంగాణ టెట్ అభ్యర్ధులకు ముఖ్య గమనిక. తెలంగాణలో జరగనున్న టెట్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల కానున్నాయి. https://tstel2024.aptonline.in/tstet/ వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.
TG TET Hall Tickets: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. తెలంగాణ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ హాల్ టికెట్లను చాలా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణలో టెట్ పరీక్షలు జనవరి 2 నుంచి ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ టెట్ 2024 పరీక్షలకు అంతా సిద్ధమైంది. జనవరి 2 నుంచి జనవరి 20 వరకూ రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. జనవరి 8,9,19,18 తేదీల్లో పేపర్ 1 పరీక్షలు నిర్వహించనుండగా పేపర్ 2 పరీక్షల్ని జనవరి 2,5,11,12,19,20 తేదీల్లో జరపనున్నారు. జనవరి 2వ తేదీన ఉదయం మద్యాహ్నం రెండు సెషన్లలో సోషల్ స్డడీస్ పేపర్ 2 పరీక్ష ఉంటుంది. ఇక జనవరి 5న ఉదయం సెషన్‌లో సోషల్ స్టడీస్ పేపర్ 2, మద్యాహ్నం మేథ్స్ -సైన్స్ పేపర్ 2 ఉంటుంది. టెట్ పరీక్షలకు మొత్తం 2,48,172 మంది దరఖాస్తు చేసుకోగా వీటిలో పేపర్ 1కు 71,655 మంది, పేపర్ 2కు 1,55,971 మంది ఉన్నారు.
తెలంగాణ టెట్ పరీక్షల్లో ఉదయం సెషన్ 9 గంటల్నించి 11.30 గంటల వరకు ఉంటుంది. మద్యాహ్నం సెషన్ 2 గంటల నుంచి 4.30 గంటల వరకూ జరుగుతుంది. టెట్ పరీక్షల ఫలితాలు ఫిబ్రవరి 5న ప్రకటిస్తారు. హాల్ టికెట్లను రేపు అంటే డిసెంబర్ 26 నుంచి వెబ్‌సైట్ ద్వారా ప్రతి ఒక్కరూ సులభంగా ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://tstel2024.aptonline.in/tstet/ ఓపెన్ చేయాలి. ఇప్పుడక్కడ హోమ్ పేజ్‌లో కన్పించే Downloan TET Hall Tickets 2024 ఆప్షన్ క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ వివరాలు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఎంటర్ చేయాలి. సబ్మిట్ బటన్ నొక్కితే మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై ప్రత్యక్షమౌతుంది. డౌన్‌లోడ్ చేసుకుని భద్రపర్చుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి