TS EAMCET 2020 final counselling: హైద‌రాబాద్‌: తెలంగాణ ఎంసెట్ ( TS EAMCET 2020) పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ( Telangana Government ) విద్యార్థులందరికీ కౌన్సెలింగ్ అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా నేటినుంచి నేటినుంచి (శనివారం) టీఎస్ ఎంసెట్ చివ‌రి విడుత కౌన్సెలింగ్ (final counselling) ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ఇంట‌ర్‌లో ఉత్తీర్ణ‌త సాధిస్తే చాల‌ని ప్ర‌భుత్వం ఇటీవ‌ల జీవో జారీ చేసింది. ఈ క్రమంలో ఇటీవలనే జరగాల్సిన ఎంసెట్ చివ‌రి విడుత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారులు స‌వ‌రిస్తూ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. Also read: Kajal, Gautam latest pics: న్యూ ఫొటోషూట్‌లో తళుక్కుమన్న కొత్త జంట


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తుదివిడుత కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్ష‌న్ల ప్ర‌క్రియ అక్టోబరు 30న ప్రారంభమైంది. అయితే కొత్త విద్యార్థులు ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న కోసం ఈరోజు స్లాట్ బుక్‌ చేసుకుంటే.. రేపు ఆయా ప్రాంతాలకు చెందిన కేంద్రాల్లో స‌ర్టిఫికెట్ల‌ను ప‌రిశీలించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ వెంటనే 9వ తేదీవ‌ర‌కు వెబ్ ఆప్ష‌న్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 12న సీట్లను కేటాయింపు జరగనుంది. అయితే సీట్లు పొందిన‌వారు 12 నుంచి 17వ తేదీ వ‌ర‌కు కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే.. ప్రైవేటు కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్స్ కోసం ప్రభుత్వం ఈనెల 14న మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేయ‌నుంది. Also read: Amazon Web Services: హైదరాబాద్‌లో అమేజాన్ 20 వేల కోట్ల పెట్టుబడులు


అయితే.. తెలంగాణలో మార్చి నెల‌లో జ‌రిగిన‌ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు ఫీజు చెల్లించి ప‌రీక్ష‌లు రాయ‌ని 27,589 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థుల‌ను ప్ర‌భుత్వం పాస్ చేసిన సంగతి తెలిసిందే. వారిలో ఎంసెట్ ఇంజినీరింగ్ రాసిన 84 మంది ఎంపీసీ విద్యార్థుల‌కు, మ‌రో 38 మందికి ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్‌లో కొత్త‌గా ర్యాంకులు కేటాయించారు. తెలంగాణ ప్రభుత్వం వెయిటేజీ నిబంధనను తొలగించడంతో విద్యార్ధులందరూ ఈ కౌన్సెలింగ్‌కు హాజరవుతారని అధికారులు భావిస్తున్నారు. Also read: Bihar Assembly Election 2020: బీహార్ తుది దశ పోలింగ్ ప్రారంభం


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe