Rain Alert: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షసూచన
Rain Alert: తెలంగాణలో మరో మూడు రోజులు మోస్తరు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం పశ్చిమ విదర్బ ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం కేంద్రీకృతమై ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rain Alert: తెలంగాణలో రానున్న మూడు రోజులు వాతావరణం ఎలా ఉంటుందో ఐఎండీ వివరించింది. సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం వ్యాపించి ఉంది. దీనికి అనుబంధంగా అల్పపీడన ప్రాంతం ఇప్పటికే కొనసాగుతోంది. దాంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.
సముద్దమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఆవహించిన ఆవర్తనం, అల్పపీడన ప్రాంతం రామగుండం పరిసర ప్రాంతాల్నించి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించింది. మరో ఉపరితల ఆవర్తనం కోస్తాంధ్ర, యానాం, పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టం నుంచి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీర్ల వరకు ఉంది. ఫలితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులు మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇవాళ, రేపు, తెంలగాణలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఎల్లుండి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇవాళ, రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురవనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇవాళ, రేపు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీయనున్నాయి.
Also read: Vijayawada Flood Pics: విలయానికి కేరాఫ్ సింగ్ నగర్, ఇంకా ముంపులోనే బెజవాడ కాలనీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.