Telangana Rain Alert: తెలంగాణలో ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల వరకూ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ సూచించింది. మార్చ్ నెలలోనే తీవ్రమైన ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఐఎండీ చల్లని కబురు అందించింది. తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్చ్ నెల ప్రారంభమౌతూనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం మారిపోయిది. పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రాత్రి వేళ ఉక్కపోత క్రమంగా పెరుగుతోంది. ఓ వారం రోజుల్నించి ఉష్ణోగ్రత మరింతగా పెరగడంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ నేపధ్యంలో వాతావరణ శాఖ ఉపశమనం కల్గించే వార్త అందించింది. రానున్న 4 రోజులు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయని తెలిపింది. కొన్ని జిల్లాలకు అయితే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో వడగండ్లు పడవచ్చని ఐఎండీ తెలిపింది. 


ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలైన హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, అదిలాబాద్, నారాయణపేట, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నిర్మల్, జగిత్యాల, ములుగు, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చు. ఇక ఉత్తర, వాయువ్య తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి, భూపాపల్లి, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాల్‌లో కూడా ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఇవాళ్టి నుంచి తెలంగాణలో వాతావరణ మేఘావృతం కానుంది. మోస్తరు వర్షాలు కురవనున్నాయి. బుధవారం నుంచి శుక్రవారం వరకు ఈదుగాలులతో వర్షాలు పడవచ్చు. 


Also read: AP & TS SSC Exams 2024: నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook