Telangana Winter:  తెలంగాణ, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. ప్రధానంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి సిర్పూర్‌లో 9.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.ఈ జిల్లాలో కెరమెరి, వాంకిడి, ధనోరా, తిర్యాణి, ఆసిఫాబాద్‌ మండలాల్లో చలితీవ్రత  ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్, నేరడిగొండ, భీంపూర్, బోథ్, బేల, ఆదిలాబాద్‌ గ్రామీణం, మావల మండలాలు వణికిపోతున్నాయి. మధ్య తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కూడా గజగజమంటోంది. కోహీర్‌లో అత్యల్పంగా 9.9 డిగ్రీలు నమోదైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుమ్మడిదల, కంగ్టి, న్యాల్‌కల్, ఆందోలు, పుల్కల్, జహీరాబాద్, మునిపల్లి మండలాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది. మహబూబ్‌నగర్, రామగుండంలలో సాధారణం కన్నా 2.7 డిగ్రీలు, హనుమకొండలో 2.6 డిగ్రీలు, హైదరాబాద్‌లో 1.2 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది.  


ఏటా డిసెంబరులో ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువ స్థాయికి పడిపోతాయి. ఈ ఏడాది కొన్ని జిల్లాల్లో నవంబరులోనే ఆ పరిస్థితి నెలకొంది. గత పదేళ్లతో పోల్చితే ఈ నెల 23వ తేదీ రాత్రి నాలుగు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్‌లో 12 డిగ్రీలు, హనుమకొండలో 12.9, మహబూబ్‌నగర్‌లో 13.4, నల్గొండలో 13.6 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter