TGS RTC: ఆగని తెలంగాణ ఆర్టీసీ పండగ బాదుడు..
TGS RTC: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా ఎపుడు పండగ సీజన్ వచ్చిన ఛార్జీల మోత మాత్రం ఆగడం లేదు. అదనపు ఛార్జీలతో ప్రయాణికుల నడ్డి విరుస్తున్నారు. ముఖ్యంగా హిందువుల పండగ అపుడే ప్రభుత్వాలకు ఈ ఛార్జీల బాదుతుందని చాలా మంది ప్రయాణికులు ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక బతుకమ్మ, దసరా పండగ అయిపోయి పది రోజులు అవుతున్న తెలంగాణలో నడస్తోన్న స్పెషల్ బస్సుల ఛార్జీల బాదుడు మాత్రం ఆగడం లేదు.
TGS RTC: దసరా పండుగ ముగిసి దాదాపుగా పది రోజులు కావొస్తోంది. అయినా TGRTC కి మాత్రం ఇంకా పండగ హ్యాంగోవర్ ముగిసినట్టు లేదు. ఇందుకు ఆ సంస్థ వసూలు చేస్తున్న ఛార్జీలే నిదర్శనం. దసరా స్పెషల్ బస్ ల పేరు తో ఆర్టీసీ అధిక చార్జీలు వసూలు చేయడంతో ప్రయాణికులు నిలువు దోపిడీకి గురవుతున్నారు.
ఉదాహరణకు నల్గొండ జిల్లా పరిధిలోని పలు డిపోల నుండి హైదరాబాదుకు వెళ్లే ఈ స్పెషల్ బస్సులలో ఈ ప్రత్యేక చార్జీలను వసూలు చేస్తున్నారు. నల్గొండ నుండి హైదరాబాదుకు నాన్ స్టాప్ బస్సుకు అసలు చార్జీ రూ.180 కాగా స్పెషల్ బస్ ఛార్జ్ రూ.250 వసూలు చేస్తున్నారు.
ఇక మిర్యాలగూడ నుండి హైదరాబాదుకు అసలు ఛార్జీ రూ. 250 రూపాయలు ఉంది. ప్రస్తుతం స్పెషల్ ఛార్జీలు మాత్రం మాత్రం రూ. 4 వందలు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఆర్టీసీ తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దసరా పండుగ ముగిసి పది రోజులు దాటిన ఇంకా ఆర్టీసీ స్పెషల్ చార్జీల పేరుతో ఇలా బస్సులు చేయడం ఏంటని మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించిన ప్రయాణికులకు నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేయడానికి ఆపాలని కోరారు. ముఖ్యంగా హిందువుల పండగలంటే ప్రభుత్వాలకు చిన్నచూపు. మరోవైపు మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల ఆర్టీసీకి వస్తోన్న నష్టాలను పురుషులపై వేస్తున్నారు. అంతేకాదు వారిపై అదనపు భారం మోపుతున్నారు. మరోవైపు స్పెషల్ బస్సుల్లో మహిళలకు మాత్రం ఉచితంగా కాకుండా.. ఛార్జీలు వసూళు చేయడంపై మహిళ ప్రయాణికులు మండిపడుతున్నారు.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter