Saddula Bathukamma Celebrations: హైదరాబాద్: తెలంగాణ (Telangana) సంస్కృతికి ప్రతీక.. ఆడపడుచుల పూల‌ సంబురం.. బతుకమ్మ పండుగ  ( bathukamma festival ). ఈ పూల పండుగ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తెలంగాణలో దసరా నవరాత్రులను పురస్కరించుకుని.. ప్ర‌కృతి (పూలను) ని దేవతామూర్తిగా భావించి తొమ్మిది రోజులపాటు ఆరాధించడం ఈ బతుకమ్మ ( bathukamma ) పండుక ప్రత్యేకత. తెలంగాణలో అక్టోబరు 16న ఎంగిలిపూలతో ప్రారంభమైన పూల పండుగ సంబురాలు ఈ రోజు శనివారం సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ చివరి రోజు సంబురాలకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు సిద్ధమవుతున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆడపడుచులు పరిమితంగా బతుకమ్మ ఆటలాడుతూ.. తీరొక్క పువ్వలతో గౌరమ్మను కొలిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. Also read: Navratri Day 8: దుర్గాదేవిగా, మహిషాసురమర్ధినీగా అమ్మవారి దర్శనం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

#Bathukamma celebrations at #Rajbhavan with #COVID19 precautions Theme song introduced pic.twitter.com/KoqbBroGK6


— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) October 23, 2020


బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్..
ఇదిలాఉంటే.. తెలంగాణ రాష్ట్ర ఆడ పడుచులకు పలువురు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్ (Tamilisai Soundararajan) సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పూల సంబరాలను చేసుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. ఈ మేరకు గవర్నర్ తమిళసై ట్విట్ చేశారు.


 [[{"fid":"195716","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"kavitha","field_file_image_title_text[und][0][value]":"కల్వకుంట్ల కవిత"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"kavitha","field_file_image_title_text[und][0][value]":"కల్వకుంట్ల కవిత"}},"link_text":false,"attributes":{"alt":"kavitha","title":"కల్వకుంట్ల కవిత","class":"media-element file-default","data-delta":"1"}}]]


శుభాకాంక్షలు తెలుపుతూ.. వీడియో విడుదల చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..
ఈ రోజు సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్సీ ‌కల్వకుంట్ల కవిత (K. Kavitha) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆమె శనివారం ట్విట్టర్ ద్వారా వీడియోను పంచుకున్నారు. ప్రతీ సంవత్సరం బతుకమ్మ పండుగ అంటేనే ఎంతో సందడిగా ఉంటుందని, అయితే కరోనా ‌మహమ్మారి కారణంగా ఎవరింట్లో వాళ్లు, మాస్కులు పెట్టుకుని పండుగను జరుపుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి పరిస్థితులలో కూడా ఆడబిడ్డలందరూ ఉత్సాహంగా బతుకమ్మ పాత పాటలను నెమరువేసుకుంటూ, యూట్యూబ్‌లో బతుకమ్మ కొత్త పాటలు వింటూ, పెద్దఎత్తున పండుగను జరుపుకుంటున్నట్టు సోషల్ మీడియాలో చూస్తున్నామంటూ కవిత పేర్కొన్నారు. ఓ పక్క కరోనా, మరోపక్క హైదరాబాద్‌లో అకాల వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని.. ఈ పరిస్థితుల్లో మనమందరం ఒకరికొకరు అండగా నిలవాలని ఆమె కోరారు.  
Also read: Bihar Assembly Elections: లాలూ విడుదలైన మరుసటి రోజే సీఎం నితీశ్‌కు వీడ్కోలు: తేజస్వీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe