Telangana Rain Updates: అర్ధరాత్రి అభయారణ్యంలో 80 మంది పర్యాటకులు.. ఒక్క ఫోన్ కాల్‌తో..!
Tourists Stranded In Mulugu: ముత్యంధార జలపాతం చూసేందుకు వెళ్లి.. అభయారణ్యంలో చిక్కుకున్న పర్యాటకులను అధికారులు రక్షించారు. NDRF, DDRF బృందాలు బాధితులు ఉన్న ప్రాంతానికి అర్ధరాత్రి వేళ చేరుకుని.. ఆహారం, తాగునీరు అందజేశారు. అనంతరం సురక్షితంగా తీసుకువచ్చారు.
Tourists Stranded In Mulugu: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ముత్యంధార జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఈ జలపాతాన్ని చూసేందుకు వెళ్లి 80 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. అర్ధరాత్రి వేళ ఒక్క ఫోన్ కాల్‌తో అధికారులు స్పందించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బుధవారం రాత్రి నుంచి సహాయక చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి వేళ వారిని రక్షించి.. బయటకు తీసుకువచ్చారు. వివరాలు ఇలా..
కుండపోత వర్షాలు కురుస్తుండడంతో వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామానికి 8 కి.మీ. దూరంలో ఉన్న ముత్యంధార జలపాతం అందాలు ఒలకబోస్తూ పరవళ్లు తొక్కుతోంది. అయితే వర్షాల నేపథ్యంలో అభయారణ్యంలో జలపాతం సందర్శననను అటవీ శాఖ అధికారులు నిషేధించారు. అయినా వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన 134 మంది పర్యాటకులు బుధవారం సాయంత్రం జలపాతం సందర్శనకు వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో మామిడి వాగు ఒక్కసారిగా పొంగిపొర్లింది. దీంతో వాగు దాటలేక అటు వైపు ప్రాంతంలోనే చిక్కుకుపోయారు. ఎంతకీ ప్రవాహం తగ్గలేదు.
దీంతో హుజూరాబాద్‌కు చెందిన తిరుమల్ డయల్ 100కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ కొప్పుల తిరుపతిరావు.. వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే వాళ్లున్న ప్రాంతానికి వెళ్లేందుకు వాగులు అడ్డంకిగా మారడంతో ఆందోళన నెలకొంది. విషయం తెలుసుకున్న మంత్రి సత్యవతి రాథోడ్ పర్యాటకులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడారు. పోలీసు ఉన్నతాధికారులు NDRF, DDRF బృందాలను పర్యాటకులు ఉన్న ప్రాంతానికి పంపించారు. బాధితులు సుక్షితంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. NDRF బృందం రక్షణ చర్యలు చేపట్టిందని చెప్పారు.
పర్యాటకులతో ములుగు ఎస్పీ గాష్ ఆలం ఫోన్‌లో మాట్లాడారు. వాగు దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని సూచించారు. ఏటూరునాగారం నుంచి NDRF, DDRF, బృందాలు నాలుగు బస్సుల్లో బయల్దేరి వెళ్లాయి. రాత్రి 11 గంటల సమయంలో వీరభద్రవరం చేరుకోగా.. అక్కడి నుంచి 8 కి.మీ. కాలినడకన వెళ్లి అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో పర్యాటకులు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. వాళ్లకు ఆహారం, తాగునీరు అందజేశారు. అనంతరం 2.20 గంటల సమయంలో NDRF బృందాలు కాపాడినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: Hyderabad Rains: అర్ధరాత్రి విరుచుకుపడుతున్న వరుణుడు, రేపు ఉదయం వరకూ అతి భారీ వర్షాల
Also Read: IND vs WI 1st ODI: విండీస్ తో తొలి వన్డే నేడే.. తుది జట్టులో ఉండేది ఎవరు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook