Telangana MLC Elections 2021: తెలంగాణలో హైదరాబాద్- మహబూబ్ నగర్- రంగారెడ్డి స్థానం, వరంగల్- ఖమ్మం- నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 14న పోలింగ్ జరగనుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (TRS), ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ ప్రచారంలో జోరు పెంచాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం అధికార టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓటర్లను బెదిరించి ఓటు వేయాలని ప్రమాణం చేయిస్తూ రాజకీయాలు చేయిస్తున్నారని టీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దిగజారి ప్రవర్తిస్తోందని ఆరోపించారు. గ్రాడ్యుయేట్లకు ఏ మాత్రం న్యాయం చేయని ప్రభుత్వం టీఆర్ఎస్(TRS) ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు అని వ్యాఖ్యానించారు. సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గడిచిన ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఎందుకు వేయలేదని తెలంగాణ(Telangana) సీఎం కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు.


Also Read: Wine Shops In Telangana: మందుబాబులకు షాక్, ఆ 2 రోజులు వైన్‌షాప్‌లు బంద్


ఓ వైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో నిరుద్యోగులను మభ్యపెట్టే పనిలో టీఆర్ఎస్ నేతలు తీరిక లేకుండా గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు విద్యాసంస్థలను వేధించిన ఘనత సైతం టీఆర్ఎస్‌కే దక్కుతుందన్నారు. టీఆర్ఎస్ నేతలు ఓటర్లను బెదిరించడంపై ఆధారాలతో తెలంగాణ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) తెలిపారు. 


Also Read: Telangana Eamcet 2021: తెలంగాణలో ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల


వామన్‌రావు న్యాయవాద దంపతులు నడిరోడ్డుపై పట్టపగలే హత్యకు గురైతే కనీసం ఆ దారుణాన్ని తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఖండించలేదని గుర్తుచేశారు. ఉద్యోగులు ఇవ్వకుండా మోసం చేశారని, కనుక పట్టభద్రులకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పిన తరువాతే ఓట్లు అడిగేందుకు వెళ్లాలన్నారు. గతంలో పలుమార్లు జర్నలిస్టులకు ఇళ్లు అని మోసం చేసిన కేసీఆర్ తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో మరోసారి జర్నలిస్టు సోదరులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని మోసం చేస్తున్నారంటూ టీఆర్ఎస్ నేతలపై ఆయన మండిపడ్డారు.


Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రజలకు సందేశం 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook