Revanth Reddy on Modi: మళ్లీ అలా చేస్తే మోదీ పునాదులు కదులుతాయి..రేవంత్ ఘాటు వ్యాఖ్యలు..!
Revanth Reddy on Modi: నేషనల్ హెరాల్డ్ కేసుపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారించింది. దీనిపై ఇప్పుడు రాజకీయ రగడ సాగుతోంది.
Revanth Reddy on Modi: బీజేపీ, ఈడీ తీరుపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. దేశ స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ వాయిస్ కోసం నేషనల్ హెరాల్డ్ పత్రిక స్థాపించారని గుర్తు చేశారు.అప్పుల్లో కూరుకుపోయిన పత్రికను రాహుల్ తిరిగి నడపడానికి సిద్ధమైయ్యారని..రూ.90 కోట్ల అప్పుల్లో ఉన్నా తిరిగి ప్రారంభించారని చెప్పారు. బీజేపీ అక్రమాలను నేషనల్ హెరాల్డ్ బయట పెడుతోందని..అందుకే అక్రమాలు జరిగాయని నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు.
2015లో దీంట్లో ఎలాంటి అక్రమాలు లేవని రిపోర్ట్ వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మళ్లీ కేసును రీఓపెన్ చేయడం వెనుక కారణాలు ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్న భయంతోనే కక్ష సాధింపులకు దిగుతున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎదురు దెబ్బలు తగుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గుణ పాఠం తప్పదని జోస్యం చెప్పారు.
నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారని గుర్తు చేశారు. త్యాగాల కుటుంబం ..గాంధీ కుటుంబమని స్పష్టం చేశారు. గాంధీ కుటుంబానికి ఆస్తులు, పదవులు అవసరం లేదన్నారు రేవంత్‌రెడ్డి. దీనిపై అన్ని రాష్ట్రాల్లో ఈడీ కార్యాలయం ముందు నిరసనలు తెలుపుతున్నామని తెలిపారు. 1980లో ఇందిరా గాంధీపై కేసు పెడితే..ఆ తర్వాతి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
జూన్ 23న సోనియాను విచారణకు పిలిస్తే..మోదీ పునాదులు కదులుతాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబంపై ఈగ వాలిన రాజకీయంగా బతికి బట్టకట్టలేరని గుర్తు చేశారు. చరిత్రలో ఇదే జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర కలను సోనియా గాంధీ నెరవేర్చారని గుర్తు చేశారు.
Also read:Southwest Monsoon: పోరు గడ్డలోకి నైరుతి రుతు పవనాలు..మూడురోజులపాటు వర్ష సూచన..!
Also read:Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 సూపర్ రికార్డు..సంబరాల్లో ప్రజలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.