Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 సరికొత్త రికార్డును నెలకొల్పారు. అత్యధిక కాలం పాలించిన జాబితాలో రెండో స్థానానికి చేరింది. థాయ్‌లాండ్ మాజీ పాలకుడు భూమిబల్ అతుల్యతేజ్‌ను వెనక్కు నెట్టారు. భూమిబల్ 1927 నుంచి 2016 మధ్య 70 ఏళ్ల 126 రోజులు సింహాసనంపై ఉన్నారు. ఎలిజబెత్-2 ..25 ఏళ్ల వయసులో రాణి అయ్యారు. ఇంకో రెండేళ్లు ఆ పదవిలో కొనసాగితే మరో రికార్డును సృష్టించనున్నారు.
ఫ్రాన్స్ లూయి-14ను అధికమించి మొదటి ప్లేస్‌కు చేరుకుంటారు. లూయి-14 ..1643 నుంచి 1715 వరకు 72 ఏళ్ల 110 రోజులు రాజుగా ఉన్నారు. ఇటు 1952లో ఎలిజబెత్-2 రాణి అయ్యారు. 1952 సెప్టెంబర్ 9న కింగ్ జార్జి-4 చనిపోయిన తర్వాత ఎలిజబెత్-2 పదవిలోకి వచ్చారు. బ్రిటన్‌ను అత్యధిక కాలం పాలించిన క్వీన్ విక్టోరియా రికార్డును 2015 సెప్టెంబర్‌లో ఎలిజబెత్ బ్రేక్ చేశారు. మరోవైపు ఆమె పాలనకు 70 ఏళ్లు నిండిన సందర్బంగా వారంరోజులుగా ఇంగ్లండ్‌లో వేడుకలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం రాణి ఎలిజబెత్-2 వయస్సు 96 ఏళ్లు. అనారోగ్యం కారణంగా వేడుకల్లో పాల్గొనలేకపోయానని ఆమె వెల్లడించారు. తనపై చూపిస్తున్న ప్రేమాభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. ఇందులోభాగంగా లేఖను విడుదల చేశారు. తన పాలనకు బ్రహ్మరథం పట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈసందర్భంగా బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కు ప్రధాని డేవిడ్ కామెరూన్ శుభాకాంక్షలు తెలిపారు.
Also read:CM Jagan Tour: ఏపీలో రైతులకు శుభవార్త..రేపే ఖరీఫ్ పంటల బీమా పరిహారం అందజేత..!
Also read:Southwest Monsoon: పోరు గడ్డలోకి నైరుతి రుతు పవనాలు..మూడురోజులపాటు వర్ష సూచన..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 సూపర్ రికార్డు..సంబరాల్లో ప్రజలు..!
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 సరికొత్త రికార్డు
అత్యధిక కాలం పాలించిన రాణిగా రికార్డు
దేశవ్యాప్తంగా సంబరాలు