Ys sharmila party: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కుమార్తె షర్మిల ఇప్పుడు రాజకీయాల్లో సంచలనంగా మారారు. తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ రాజకీయాల్లో(Telangana politics ) ఒక్కసారిగా సంచలనం రేపారు వైఎస్ షర్మిల ( Ys Sharmila ). ఇప్పటికే లోటస్ పాండ్ లో అభిమానులతో ఆత్మీయ సమావేశంలో కొత్త పార్టీపై ప్రకటన చేశారు. షర్మిల చేసిన ప్రకటనతో రాష్ట్రంలో ఒక్కసారిగా కలవరం రేగింది. రాజకీయ పార్టీలన్నీ అప్రమత్తమై..విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ ( Congress ), బీజేపీ ( BJP ), టీఆర్ఎస్ ( TRS ) అన్ని పార్టీలు ఆరోపణలు సంధించాయి. ఈ నేపధ్యంలో టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వైఎస్ షర్మిల కొత్త పార్టీ విషయంలో ఆయన తనదైన శైలిలో స్పందించారు.


మతం ప్రాతిపదికన కొత్త పార్టీలు వస్తున్నాయంటూ  టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ ( Etela Rajender )వివాదం రేపారు. కొత్త పార్టీ వస్తున్న క్రమంలో విమర్శలు మామూలే అయినా.. షర్మిల తన పార్టీ పేరు.. గుర్తుతో సహా ఏ విషయాల్ని వెల్లడించక ముందే.. మతం ముద్ర వేయటం చూస్తే.. షర్మిల పార్టీని దెబ్బ తీసే దిశగా ఈటెల లాంటి నేతలు రంగంలోకి దిగారా? అనే సందేహాలు వస్తున్నాయి. షర్మిల పార్టీపై ఈటెల నేరుగా.. సూటిగా వ్యాఖ్యలు చేయనప్పటికి.. కొత్తగా వచ్చే వారికి తెలంగాణతో ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. సెంటిమెంట్స్ ఎక్కువ కాలం పని చేయదని చెప్పిన ఆయన.. మతం పేరుతో వచ్చే ఇతర రాష్ట్రాల వారి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టే ఆలోచనలు ఆగిపోవాలని కోరారు. అయితే ఈ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలా లేదా పార్టీ పరంగా చేసినవా అనేది స్పష్టత లేదు. షర్మిల కొత్త పార్టీని ఎదుర్కొనేందుకు అప్పుడే మతం ముద్ర వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  


Also read: Minister Indrakaran Reddy: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి చేదు అనుభవం.. Convoy అడ్డుకున్న రైతులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook