TRS MLA Bigala Ganesh Gupta | హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ఇప్పటికే జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌ని కరోనా వైరస్ వేధిస్తుండగా తాజాగా వారి జాబితాలో మరో ఎమ్మెల్యే వచ్చి చేరారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న బిగాల గణేష్ గుప్తాకు కూడా కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో ( TRS MLA Bajireddy Govardhan) గణేష్ గుప్తా కాంటాక్ట్ అయినట్టు తెలుస్తోంది. గత 2 రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో పాటు తాను కలిసిన బాజిరెడ్డి గోవర్థన్‌కి కూడా పాజిటివ్ అని నిర్ధారణ అయిన నేపథ్యంలో బిగాల గణేష్ గుప్తా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నుండే అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు  కరోనా వైరస్ సోకి ఉండుంటుంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్‌గా కరోనా టెస్టులకు ధర నిర్ణయించిన ప్రభుత్వం )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాజిరెడ్డి గోవర్థన్ సైతం ఇలాగే నాలుగు రోజుల క్రితం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని ( TRS MLA Muthireddy Yadagiri Reddy) కలిశారని.. అందువల్లే ఆయనకు  కరోనా వైరస్ సోకిందని వార్తలొచ్చాయి. ఇక ఇప్పుడు బాజిరెడ్డి గోవర్థన్ నుంచి బిగాల గణేష్ గుప్తాకు కరోనా సోకడంతో.. ఈ కరోనా లింక్ ఇలా ఇంకెంత మందికి ఉండి ఉంటుందనే భయం అటు వారిని కలిసిన నేతల్లో, పార్టీ శ్రేణులను వేధిస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, జనగామ నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ది పనులు, ప్రజా సమస్యలపై సంబంధిత ఎమ్మెల్యేలను కలిసిన అధికారులు, నేతల్లో ఈ భయం ఎక్కువగా కనిపిస్తోంది.


Telangana: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌కి కరోనా సోకడానికి కారణం ఇదేనా ? )


ఇదిలావుంటే, జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇవాళ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ఉన్న తన నివాసానికి చేరుకున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..