సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి (MLA Solipeta Ramalinga Reddy) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే తుదిశ్వాస (Solipeta Ramalinga Reddy Dies) విడిచారు. సుమారు 25 ఏళ్ళు జర్నలిస్టుగా పనిచేసిన సోలిపేట.. కేసీఆర్ పిలుపుమేరకు రాజకీయాల్లోకి వచ్చారు. Gold Rate: బంగారం ధర పైపైకి.. భారీ షాకిచ్చిన వెండి!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దొమ్మాట నియోజకవర్గం నుంచి 2004, 2008లో టీఎర్ఎస్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఆపై 2014, 2018 సార్వత్రిక ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే (Dubbaka MLA Solipeta Ramalinga Reddy)గా గెలుపొందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.  పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...


టీఆర్ఎస్ పార్టీ (TRS) స్థాపించినప్పటినుంచి కేసీఆర్‌తో కలిసి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. కేసీఆర్ పిలుపుమేరకు జర్నలిజాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. సీఎం కేసీఆర్ సహకారంతో దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. Sunnam Rajaiah: కరోనాతో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే మృతి


టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి స్వస్థలం దుబ్బాక మండలం చిట్టాపూర్. ఆయనకు భార్య, కుమారుడు సతీష్ రెడ్డి, కుమార్తె ఉన్నారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు మరణంపై టీఆర్ఎస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.  మీ ఆరోగ్యం కోసం ఈ Health Tips పాటించండి 
Photos: గులాబీ డ్రెస్సులో యంగ్ బ్యూటీ గుబాళింపు..