Gold Rate: బంగారం ధర పైపైకి.. భారీ షాకిచ్చిన వెండి!

బులియన్ మార్కెట్‌లో కరోనా సమయంలో ఊహించలేనంతగా ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బంగారం ధరలు (Gold Price Today) పెరగగా, వెండి సైతం రికార్డు ధరలతో కస్టమర్లలో ఆందోళన పెంచింది.

Last Updated : Aug 7, 2020, 07:40 AM IST
  • నేడు భారీగా పెరిగిన బంగారం ధర
  • కరోనా సమయంలో ఊహించని షాకిచ్చిన వెండి
  • ఏకంగా రూ.71వేల మార్కు చేరిన వెండి ధరలు
Gold Rate: బంగారం ధర పైపైకి.. భారీ షాకిచ్చిన వెండి!

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Rate Today) ఓ మోస్తరుగా పెరిగాయి. అయితే నిన్న తగ్గిన వెండి ధరలు నేడు ఏకంగా రూ.6వేల పైగా ర్యాలీ చేశాయి. హైదరాబాద్‌ (Gold Rates Today In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.1,010 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.57,820కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.930 పెరిగి రూ.53,010కి ఎగసింది. Rohit Sharma: ముంబై జట్టులో రోహిత్‌కు అతి తక్కువ ప్రాధాన్యం

ఢిల్లీలోనూ బంగారం ధరలు (Gold price in Delhi) భారీగా పెరిగాయి. తాజాగా రూ.950 మేర పెరుగుదలతో మార్కెట్ ప్రారంభమైంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,700 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం అంతే పెరగడంతో 10 గ్రాముల ధర రూ.53,500కి చేరింది. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...

బులియన్ మార్కెట్‌లో నేడు వెండి ధర (Silver Rate in India) కేజీపై రూ.6,450 మేర పెరిగింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.71,500కి పెరిగింది. తొలిసారిగా వెండి ధర 70 వేల మార్కు చేరుకుంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో కొనసాగుతోంది.  మీ ఆరోగ్యం కోసం ఈ Health Tips పాటించండి 
Photos: గులాబీ డ్రెస్సులో యంగ్ బ్యూటీ గుబాళింపు..

 

Trending News