TS EAMCET 2020 agriculture exam stared: హైదరాబాద్: తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని అగ్రిక‌ల్చ‌ర్ (agriculture) కోర్సుల్లో ప్ర‌వేశాల‌కోసం నిర్వ‌హించే ఎంసెట్ ప‌రీక్ష‌లు సోమవారం ప్రారంభమయ్యాయి. నేడు, రేపు (సెప్టెంబరు 28, 29 ) ఈ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లల్లో జరగనున్నాయి. అయితే ఈ TS EAMCET ప‌రీక్ష‌ల‌ను ఆన్‌లైన్‌లో నిర్వ‌హించనున్నారు. ఈ ప‌రీక్ష కోసం ఇరు రాష్ట్రాల నుంచి 78 వేలకుపైగా విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ ప‌రీక్ష కోసం రాష్ట్రంలో 67, ఆంధ్రప్రదేశ్‌ (AP) లో 17 మొత్తం 84 ప‌రీక్ష కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు అధికారుల వెల్లడించారు. కోవిడ్ (Coronavirus) నిబంధనలు పాటిస్తూ ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జేఎన్‌టీయూ (JNTU) వెల్లడించింది. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించేలా.. భౌతిక దూరం పాటించేలా పరీక్షా కేంద్రాల వద్ద చర్యలు తీసుకున్నారు. Also read: INDIGO: ఇండిగో విమానాన్ని ఢికొన్న పక్షి


క‌రోనావైరస్ నేప‌థ్యంలో వాయిదాపడిన ప్రవేశపరీక్షలు రాష్ట్రంలో గత కొన్ని రోజులనుంచి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇంజినీరింగ్ కోర్సుల‌కు సంబంధించిన ఎంసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌లు కూడా పూర్త‌య్యాయి. అయితే ఈ అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్ష మొదటి సెషన్ ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు... రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జరగనుంది. Also read: Contract Lecturers Salaries In AP: కాంట్రాక్ట్‌ లెక్చరర్లకు సీఎం వైఎస్ జగన్ శుభవార్త