Telangana Changes: తెలంగాణలో సమూల మార్పులు.. ఊరు, పేరు, చిహ్నం, తల్లి అన్నీ మార్పే
Congress Changes: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంచల నిర్ణయాలు తీసుకుంది. పదేళ్లుగా ఉన్న తెలంగాణ అధికారిక గుర్తులను చెరిపేయాలని నిర్ణయించింది. పేరు, ఊరు, చిహ్నం, తల్లి ఇలా అన్నింటినీ మార్చేయడానికి సిద్ధమైంది.
Telangana Ministers Council: కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లుగా కొనసాగుతున్న తెలంగాణ చిహ్నాలన్నీ మార్చాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుతోపాటు బడ్జెట్ సమావేశాలపై చర్చించింది. మరికొన్ని నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరించింది. వాటిలో ప్రభుత్వ అధికార రాజముద్ర, వాహనాల నంబర్ ప్లేట్లపై పేరు మార్పు, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు వంటివి చేయాలని మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంది.
Also Read: Revanth Vs Harish Rao: తెలంగాణలో జల యుద్ధం.. రేవంత్ కాస్కో అంటూ సవాల్ విసిరిన హరీశ్ రావు
సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వివరించారు. వాటిలో ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.500 కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత కరెంట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు మంత్రి తెలిపారు. ఇక ఇన్నాళ్లు వాహనాల నంబర్ ప్లేట్లపై కొనసాగుతున్న టీఎస్ పేరును కాస్త టీజీగా మార్చాలని నిర్ణయించింది.
Also Read: CM Revanth Reddy: ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం.. కేసీఆర్, కేటీఆర్ లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్..
రాష్ట్ర గేయంపై ఉన్న గందరగోళానికి తాజా మంత్రివర్గ సమావేశంలో స్పష్టత వచ్చింది. రాష్ట్ర అధికార గేయంగా 'జయ జయహే తెలంగాణ'ను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు.గత బీఆర్‌ఎస్ పాలనలో తీసుకున్న చిహ్నాలు, తెలంగాణ తల్లి విగ్రహం, రాజముద్ర వంటివి మారుస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం దొరలతనానికి నిదర్శంగా అవి ఉన్నాయని మంత్రి ఆరోపించారు. తెలంగాణ ఆత్మ ప్రతిబింబించేలా రాష్ట్ర రాజముద్ర రూపొందిస్తామని వివరించారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు కూడా చేయాలని నిర్ణయించారు. తెలంగాణ మదిలో ఉన్న రూపాన్ని సాక్షాత్కరించేలా కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర చిహ్నంలో కూడా మార్పులు చేసేందుకు మంత్రివర్గం నిర్ణయించింది.
ఇక ఇటీవల కుల గణనపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తాజాగా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే కుల గణన చేపట్టేందుకు మంత్రివర్గంలో చర్చించారు. ఇక అసెంబ్లీ సమావేశాలపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈనెల 8వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అవే సమావేశాల్లో మరో రెండు గ్యారెంటీ పథకాలను ముఖ్యమంత్రి ప్రకటిస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇక గ్రూప్ 1 ఉద్యోగ ప్రకటనపై కీలక నిర్ణయం తీసుకుంది. 160 అదనపు పోస్టులు కలిపి కొత్తగా మళ్లీ ప్రకటన విడుదల చేసేందుకు మంత్రివర్గం నిర్ణయించింది.
'మార్పు'లపై రచ్చ
పదేళ్ల అనంతరం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారిక ముద్ర, చిహ్నం, విగ్రహంలో మార్పులు చేయాలనే నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ ఇర్ణయాలపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. వాహనాల నంబర్ ప్లేట్లపై తీవ్ర నిరసన వ్యక్తమయ్యేలా ఉంది. ఇప్పటికే సామాజిక మాధ్యమాల ద్వారా ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా మార్పులపై ప్రతిపక్షాలే కాకుండా ప్రజలు కూడా వ్యతిరేకించేలా పరిస్థితులు ఉన్నాయి. మార్పు అంటే ఇదా అని ప్రశ్నిస్తున్నారు. పాలనలో మార్పులు రావాలి కానీ చిహ్నాలు, పేర్లు, విగ్రహాల్లో మార్పు ఎందుకు అని నిలదీస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook