Telangana Jobs: ఏఆర్‌టీ సెంటర్లలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
TSACS Recruitment 2020 | తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (TSACS) కాంట్రాక్టు విధానంలో పలు పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ మేరకు తెలంగాణలోని ఆయా జిల్లాల్లోని ఏఆర్‌టీ సెంటర్లలోని ఖాళీల (Telangana Jobs 2020)ను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (TSACS) కాంట్రాక్టు విధానంలో పలు పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ మేరకు తెలంగాణలోని ఆయా జిల్లాల్లోని ఏఆర్‌టీ సెంటర్లలోని ఖాళీల (Telangana Jobs 2020)ను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 11 తేదీలోగా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
Also Read : Pensioners Life Certificate: ఈపీఎఫ్‌వో సరికొత్త సదుపాయం
మొత్తం 47 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. పోస్టుల ఆధారంగా అర్హతలు నిర్ణయించారు. ఇంటర్ నుంచి ఎంబీబీఎస్, ఎండీ ఉత్తీర్ణత, అనుభవం పోస్టులను బట్టి అవసరం ఉంటుంది.
1) మెడికల్ ఆఫీసర్: 24 పోస్టులు
2) సీనియర్ మెడికల్ ఆఫీసర్: 01 పోస్ట్
3) కౌన్సెలర్: 09 పోస్టులు
4) డేటా మేనేజర్: 05 పోస్టులు
5) స్టాఫ్ నర్సు: 04 పోస్టులు
6) కేర్ కో-ఆర్డినేటర్: 03 పోస్టులు
7) ల్యాబ్ టెక్నీషియన్: 01 పోస్టులు
రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత జిల్లాల మెడికల్ సూపరింటెండెంట్ అధికారులకు పంపాలి. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ http://tsacs.telangana.gov.in/ను సందర్శించండి. నోటిఫికేషన్ అని కనిపించే సెక్షన్‌లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe