హైద‌రాబాద్‌: తెలంగాణలోని పీవీ న‌ర‌సింహారావు తెలంగాణ వెట‌ర్న‌రీ యూనివ‌ర్సిటీలో ( PVNRTUV ) ఖాళీగా ఉన్న ల్యాబ్‌టెక్నీషియ‌న్‌ ( Lab technicians), వెట‌ర్న‌రీ అసిస్టెంట్ ( Veterinary assistant ) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. రాత ప‌రీక్ష ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక‌చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ( Also read: India Ideas Summit: అమెరికా కంపెనీలకు ప్రధాని మోదీ ఆహ్వానం )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోస్టుల వివ‌రాలను పరిశీలిస్తే..


Lab technicians posts: ల్యాబ్‌టెక్నీషియ‌న్ పోస్టులు- 9 


జ‌న‌ర‌ల్‌-4, బీసీ-1, ఎస్సీ-2, ఎస్టీ-1, పీహెచ్‌-1 చొప్పున రిజర్వేషన్ వర్తిస్తుంది.  


అర్హ‌త‌లు: ల్యాబ్‌టెక్నీషియ‌న్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండటంతో పాటు మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీలో డిగ్రీ లేదా మెడిక‌ల్ ల్యాబొరేట‌ర్ టెక్నాల‌జీలో డిప్లొమా చేసి ఉండాలి.


Veterinary assistants posts: వెట‌ర్న‌రీ అసిస్టెంట్‌- 22 


జ‌న‌ర‌ల్ 7, బీసీ 2, ఎస్సీ-2, ఎస్టీ-1, పీహెచ్‌సీ-1 చొప్పున పోస్టులకు రిజర్వేషన్ వర్తిస్తుంది. 


అర్హ‌త‌లు: వెట‌ర్న‌రీ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 10వ త‌ర‌గ‌తి ఉత్తీర్ణులై ఉండటంతో పాటు యానిమ‌ల్ హ‌జ్బండ‌రీ లేదా పౌల్ట్రీ కోర్సులో రెండేండ్ల పాలిటెక్నిక్ డిప్లొమాలో పాస్ అయ్యుండాలి. ( Also read: Telangana: 50 వేలకు చేరువలో కరోనా కేసులు )


How to apply: ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో


Application fee: ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.200, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, నిరుద్యోగులు రూ.80 చెల్లించాలి.


Age: వ‌య‌స్సు: 18 నుంచి 34 ఏళ్ల లోపు వారు ఈ ఉద్యోగాలకు అర్హులుగా ప్రకటిస్తున్నట్టు టిఎస్పీఎస్సీ స్పష్టంచేసింది. అయితే, ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌యోప‌రిమితిలో సడ‌లింపు ఉంటుందని టిఎస్పీఎస్సీ ( TSPSC ) తేల్చిచెప్పింది.  ( Also read: Health tips: వేపాకుతో ఇన్ని లాభాలు, ప్రయోజనాలా ? )


అభ్యర్థుల ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ఆధారంగా


Important dates: ముఖ్యమైన తేదీలు:


ద‌ర‌ఖాస్తులు ప్రారంభ తేది: జూలై 28


ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: ఆగ‌స్టు 17


వెబ్‌సైట్‌: www.tspsc.gov.in


 ( Also read: COVID-19 vaccine: కరోనా వ్యాక్సిన్‌పై మరో కుట్రకు తెరతీసిన చైనా : అమెరికా )