India Ideas Summit: అమెరికా కంపెనీలకు ప్రధాని మోదీ ఆహ్వానం

భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా కంపెనీలకు ( US Companies ) ఆహ్వానం పలికారు. యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ నేతృత్వంలో జరిగిన ఇండియా ఐడియాస్ సదస్సును ( India Ideas Summit ) ఉద్దేశించి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.  

Last Updated : Jul 23, 2020, 03:05 AM IST
India Ideas Summit: అమెరికా కంపెనీలకు ప్రధాని మోదీ ఆహ్వానం

న్యూఢిల్లీ: భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా కంపెనీలకు ( US Companies ) ఆహ్వానం పలికారు. యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ నేతృత్వంలో జరిగిన ఇండియా ఐడియాస్ సదస్సును ( India Ideas Summit ) ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధాని మోదీ.. రక్షణ రంగం, అంతరిక్ష రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా అమెరికా సంస్థలకు సూచించారు. ప్రైవేటు పెట్టుబడిదారులకు ( Private investers ), విదేశీ పెట్టుబడిదారులకు ( Foreign investers ) భారత్ ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోందనే విషయాన్ని ఇండియా ఐడియాస్ సదస్సు వేదికగా ప్రధాని మోదీ గుర్తుచేశారు. ( Also read: Telangana: 50 వేలకు చేరువలో కరోనా కేసులు )

భారత్ - అమెరికా సహజ మిత్రులని అభిప్రాయపడిన ప్రధాని మోదీ... భారత ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ భారత్‌ ( Atmanirbhar bharat ) కోసం అమెరికా కూడా తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా భారత రక్షణ రంగంలో 74%, బీమా రంగంలో ఏకంగా 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించామని చెప్పిన ప్రధాని... సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక వసతుల కల్పన రంగాల్లోనూ విదేశీ పెట్టుబడులకు అవకాశం ఉందని అన్నారు.  ( Also read: COVID-19 vaccine: కరోనా వ్యాక్సిన్‌పై మరో కుట్రకు తెరతీసిన చైనా : అమెరికా )

పౌర విమానయాన రంగంలోనూ ( Civil aviation ) పెట్టుబడులకు అవకాశం ఉందని సూచించిన ప్రధాని మోదీ.. రానున్న 8 ఏళ్లలో విమాన ప్రయాణికుల సంఖ్య రెండింతల కంటే అధికం అయ్యే అవకాశాలున్నాయని అన్నారు. విమానాల సంఖ్య పెంచేందుకు ప్రైవేటు ఎయిర్ లైన్స్ ఆపరేటర్స్ ప్రయత్నిస్తున్నందున.. భారత్‌లో విమానాల తయారీ ( Flight making unit ) పరిశ్రమ సైతం నెలకొల్పవచ్చని ఆశాభావం వ్యక్తంచేశారు. కరోనావైరస్ వెంటాడుతున్న సంక్షోభంలోనే పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్తూ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రధాని మోదీ సూచించారు.  ( Also read: Health tips: వేపాకుతో ఇన్ని లాభాలు, ప్రయోజనాలా ? )

Trending News