TSRJC Cet Cancelled: కోవిడ్19 సెకండ్ వేవ్ ఎఫెక్ట్, టీఎస్ ఆర్‌జేసీ సెట్ రద్దు, టెన్త్ మార్కులు కీలకం
TSRJC Cet Cancelled Due To COVID-19: తెలంగాణలో టీఎస్ ఆర్‌జేసీ సెట్ రద్దు చేశారు. కేంద్ర విద్యాశాఖ సైతం తొలుత సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేసింది. కరోనా సెకండ్ ప్రభావం ఇంకా ఉన్న కారణంగా 12వ తరగతి బోర్డు పరీక్షలను సైతం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
TSRJC Cet Cancelled: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల టెన్త్ క్లాస్ పరీక్షలు రద్దు చేసింది. కేంద్ర విద్యాశాఖ సైతం తొలుత సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేసింది. కరోనా సెకండ్ ప్రభావం ఇంకా ఉన్న కారణంగా 12వ తరగతి బోర్డు పరీక్షలను సైతం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణలో టీఎస్ ఆర్‌జేసీ సెట్ రద్దు చేశారు. సాంఘిక సంక్షేమ శాఖల్లో ఇంటర్ కాలేజీలలో ప్రవేశాల కోసం టీఎస్ఆర్‌జేసీ సెట్ (TSRJC CET) నిర్వహిస్తారు.
కానీ కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సెట్‌ను రద్దు చేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. పదో తరగతి ఫలితాల ఆధారంగా ఇంటర్మీడియెట్ కాలేజీలలో ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేస్తారని తెలిపారు. సెట్ రాయాలనుకున్న ఆసక్తిగల విద్యార్థులు జూన్ 7వ తేదీలోగా తమ 10వ తరగతి మార్కులు, ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://tswreis.in/ లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook