తెలంగాణ గురుకుల కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాల కోసం నిర్వహించిన TSRJC CET 2020 ఫలితాలు (TSRJC CET Results 2020) మంగళవారం (అక్టోబరు 13న) విడుదలయ్యాయి. (Telangana) తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్(TSRJC) సొసైటీ పరిధిలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 3 వేల సీట్ల భర్తీకి TSRJC CET 2020 పరీక్ష నిర్వహించారు. ఆ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.
TSRJC CET 2020 ఫలితాల కోసం క్లిక్ చేయండి
విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టినతేదీతో పాటు అక్కడ క్యాప్చాలో కనిపించే కోడ్‌ను నమోదు చేసి క్లిక్ చేయగానే మీ ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ అవుట్ తీసుకుంటే తర్వాత సీట్ల కేటాయింపు సమయంలో హెల్ప్ అవుతుంది.
MPC విభాగంలో 1500, BiPC విభాగంలో 1440 సీట్లు, ఎంఇసీ విభాగంలో 60 సీట్లు ఇంటర్ ఫస్టియర్‌లో భర్తీ చేస్తారు. TSRJC CET 2020 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఎంపీసీలో చేరనున్న విద్యార్థులకు అక్టోబరు 19న, బైపీసీ, ఎంఇసీ విభాగాలలో జాయిన్ కానున్న విద్యార్థులకు అక్టోబరు 20న కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. Also Read : CBSE 10th Compartment Results 2020: సీబీఎస్ఈ పదో తరగతి కంపార్ట్‌మెంట్ ఫలితాలు విడుదల
- Also Read : Bigg Boss 4 Voting Numbers: మీ ఫెవరెట్ కంటెస్టెంట్ ఓటింగ్ నెంబర్స్ ఇవే.. ఇలా సేవ్ చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe