TSRTC bus catches fire: హైదరాబాద్: టిఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు పూర్తిగా మంటల్లో దగ్ధమైన ఘటన జనగాం జిల్లా స్టేషన్ ఘణపూర్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. హన్మకొండ నుంచి హైదరాబాద్ వస్తున్న సూపర్ లగ్జరీ బస్సు (Super luxury bus caught fire) వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. బస్సు వెనుక భాగం నుంచి పొగలు వస్తున్నాయని ప్రయాణికులు హెచ్చరించడంతో ప్రమాదం పసిగట్టిన బస్సు డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కిందకు దించేశారు. ఆ తర్వాత కొద్దిసేపట్లోనే అందరూ చూస్తుండగానే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించాయి. కొన్ని నిమిషాల వ్యవధిలోనే బస్సు మంటల్లో కాలిబూడిదైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బస్సు అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు (Bus fire accident) బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు చెప్పగానే వెంటనే డ్రైవర్ అప్రమత్తమై పక్కకు ఆపడంతోనే పెను ప్రమాదం తప్పింది. 


Also read : Motkupalli ‍‍‍Narsimhulu:ఈటల రాజేందర్‌ చేరికతో బీజేపిని వీడిన మోత్కుపల్లి నర్సింహులు


హైదరాబాద్ నుంచి మోత్కూరు మీదుగా తొర్రూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు (TSRTC bus) రన్నింగులో ఉండగానే చక్రాలు ఊడిపోయిన ఘటన ఆర్టీసీ ప్రయాణికుల వెన్నులో వణుకు పుట్టించింది. బస్సు ఫిట్‌నెస్ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్ చెప్పడం చూస్తోంటే.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం అని తాటికాయంత అక్షరాలతో బస్సులపై, బస్సుల్లో రాస్తున్న రాతల్లో ఎంత మేరకు నిజం ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 


ఇదిలావుంటే, ఆర్టీసీ బస్సుకు (TSRTC) చక్రాలు ఊడిన ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే ఇప్పుడిలా బస్సు మంటల్లో కాలి దగ్ధమవడం బస్సుల కండిషన్‌పై మరిన్ని అనుమానాలకు తావిస్తోందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.


Also read : Heavy rains in Telangana: వరద నీటిలో నిర్మల్.. ఇళ్లలోకి భారీగా వరద నీరు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook