TSRTC Bus Pass Discount: పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు టీఎస్ఆర్టీసీ బంపరాఫర్..
TSRTC Bus Pass Discount: తెలంగాణలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు టీఎస్ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. ఆర్టీసీ బస్ పాసులపై డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది.
TSRTC Bus Pass Discount: తెలంగాణలో కొద్దిరోజులుగా నోటిఫికేషన్ల విడుదల పర్వం కొనసాగుతోంది. వేల సంఖ్యలో ఉద్యోగాలకు ప్రకటనలు వెలువడుతున్నాయి. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు.. ఈ పరిణామంతో యాక్టివ్ అయ్యారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. కోచింగ్ సెంటర్లలో చేరుతున్నారు. జాబ్ కొట్టడమే లక్ష్యంగా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లతో ఉద్యోగాల జాతరకు శ్రీకారం చుడితే.. తెలంగాణ ఆర్టీసీ కూడా నిరుద్యోగులకు బంపరాఫర్ ఇచ్చింది. ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుల కోసం బస్‌పాస్ ఛార్జీల్లో డిస్కౌంట్ ప్రకటించింది. హైదరాబాద్ సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల పాసులపై 20శాతం డిస్కౌంట్ ప్రకటించింది. మూడు నెలల వరకూ ఈ సదుపాయం అమలు చేస్తామని తెలిపింది. ఈమేరకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో వివరాలను వెల్లడించారు.
ఆర్టీసీ కల్పిస్తున్న ఈ సదుపాయాన్ని వినియోగించుకునే వాళ్లు తాము పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్నట్లు, కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటున్నట్లు ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. డిస్కౌంట్‌తో కూడిన బస్‌పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు ఆధార్ కార్డ్ జిరాక్స్, తాము కోచింగ్ తీసుకుంటున్న సెంటర్ ఐడీ కార్డు జిరాక్స్‌లు బస్‌పాస్ తీసుకునే సమయంలో అందించాలి. మూడు నెలల కోసం ఆర్డినరీ బస్ పాస్ ఛార్జీ రూ.3,450 కాగా, 20 శాతం డిస్కౌంట్‌తో రూ.2800 చెల్లిస్తే సరిపోతుంది. అలాగే మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ తీసుకోవాలనుకునేవాళ్లు.. ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ.3,900 కు బదులు.. రూ.3,200 చెల్లిస్తే సరిపోతుంది.
Also Read: Horoscope Today May 1st 2022: ఆ రాశి వారికి హెచ్చరిక.. తెలిసిన వ్యక్తులే నమ్మక ద్రోహం చేసే ఛాన్స్
Also Read: AP Tenth Exams: పదవ తరగతి పరీక్షల్లో మార్పుల్లేవు, మరి రంజాన్ పండుగన పరీక్ష ఉంటుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.