Telangana Womens Commission: హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం (TS Govt) కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తెలంగాణ మహిళా కమిషన్ (Telangana Womens Commission)‌ చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని నియమించింది. ఆమెతోపాటు మరో ఆరుగురిని కమిషన్‌ సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆదివారం (Telangana) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌, సభ్యులు ఐదేండ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. Also Read: Rythu Bandhu: నేటినుంచి ‘రైతుబంధు’ సాయం పంపిణీ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెదక్ నుంచి మూడుసార్లు కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి 2019లో టీఆర్ఎస్ (TRS) ‌లో చేరారు. ఈ క్రమంలోనే ఆమెను (Vakiti Sunitha Laxma Reddy) మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియామిస్తూ అధికారపార్టీ నిర్ణయం తీసుకుంది. సభ్యులుగా.. పద్మ (వరంగల్‌), షాహీనా అఫ్రోజ్‌ (హైదరాబాద్‌‌), ఈశ్వరీబాయి (ఇంద్రవెల్లి), ఉమాదేవి యాదవ్‌ (మంచిర్యాల), సూదం లక్ష్మి (నిజామాబాద్‌), కటారి రేవతిరావు (పెద్దపల్లి) ని నియ‌మిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. Also Read: Double Bedroom అమ్మితే కేసు నమోదు చేస్తాం: హరీశ్‌రావు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook