Minister KTR: హైదరాబాద్ నగరంలో వార్డు పాలన వ్యవస్థ.. త్వరలోనే శ్రీకారం: మంత్రి కేటీఆర్
Ward Governance System In Hyderabad: హైదరాబాద్‌లో సరికొత్త పరిపాలన విధానం రాబోతుంది. ఇక అన్ని సమస్యలు వార్డు పరిధిలోనే పరిష్కరించే విధంగా వార్డ్ పాలన వ్యవస్థను త్వరలో ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. పూర్తి వివరాలు ఇలా..
Ward Governance System In Hyderabad: ప్రజలకు పరిపాలన ఫలాలు అందించాలన్న ఒక ఉన్నత లక్ష్యంతో తెలంగాణ ఏర్పాటైందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ పరిపాలనను వికేంద్రీకరించి.. నూతనంగా జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను, మండలాలను, ఏర్పాటు చేశారని అన్నారు. దీంతోపాటు నూతన పురపాలికలను, గ్రామపంచాయతీలను కూడా ఏర్పాటు చేసి ప్రజల ఇంటి ముందుకే పరిపాలన ఫలాలను తీసుకువెళ్లే ప్రయత్నంలో ప్రభుత్వం విజయం సాధించిందని తెలిపారు. హైదరాబాద్ నగరంలోనూ పరిపాలనను మరింతగా ప్రజలకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో త్వరలో వార్డ్ పాలన వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. బుధవారం నూతన సచివాలయంలో పురపాలక శాఖపైన మంత్రి విస్తృతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
వార్డు పాలన వ్యవస్థను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికలపై పురపాలక శాఖ ఉన్నతాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి కేటీఆర్. వార్డు పాలన వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వ ఆలోచన విధానాన్ని, లక్ష్యాలను అధికారులకు మంత్రి వివరించారు. ఇక నుంచి ప్రజలు సమస్యల పరిష్కారానికి సర్కిల్ కార్యాలయాలకు, జోనల్ ఆఫీసులకు వెళ్లకుండా వార్డు పరిధిలోనే తమ ఫిర్యాదు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వార్డు పాలన వ్యవస్థతో ప్రభుత్వానికి అవసరమైన సలహాలు సూచనలు అందించేందుకు వీలు కలుగుతుందన్నారు. దీంతో వేగంగా ప్రభుత్వానికి ప్రజల సమస్యలను తెలుకోవడంతోపాటు.. వెంటనే పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ పాలనలో ప్రజల భాగసామ్యం పెంచడమే ఈ కొత్త విధాన లక్ష్యమని చెప్పారు.
హైదరాబాద్ GHMC పరిధిలో ఉన్న 150 వార్డుల్లో కొత్తగా వార్డ్ ఆఫీసులను ఏర్పాటు చేస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్. GHMC ఏర్పాటు చేయనున్న ఈ వార్డ్ ఆఫీసులలో 10 మంది క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఈ వ్యవస్థకు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి ఇంఛార్జీగా ఉంటారని అన్నారు. ఈ అధికారికి అనుబంధానికి దాదాపు 10 మంది అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల అమలుతో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి.. సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తారని మంత్రి తెలిపారు.
Also Read: YS Sharmila: బీఆర్ఎస్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో చెప్పిన వైఎస్ షర్మిల.. మొత్తం ఎన్ని కోట్లంటే..?
Also Read: Virat Kohli Vs Gautam Gambhir: విరాట్ కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం.. షాకిచ్చిన బీసీసీఐ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి