Wine Shops Closed In GHMC: మూడు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్
నేడు చివరిరోజు నేతలు తమ వ్యూహాలను ప్రచారం చేసి జనాల్లోకి తీసుకెళ్లేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచార పోరు నేటి సాయంత్రం ముగియనుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం తెరపడనుండటంతో మద్యం (Wine Shops Closed in Hyderabad) విక్రయాలను నిలిపివేయనున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల (GHMC Elections 2020) ప్రచార పోరు నేటి సాయంత్రం ముగియనుంది. నేడు చివరిరోజు నేతలు తమ వ్యూహాలను ప్రచారం చేసి జనాల్లోకి తీసుకెళ్లేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు తమ పనులలో బిజీగా ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం తెరపడనుండటంతో మద్యం విక్రయాలను నిలిపివేయనున్నారు. మూడు రోజులపాటు మద్యం షాపులు బంద్ కానున్నాయి.
ఆదివారం సాయంత్రం (నవంబర్ 29న) 6 గంటల నుంచి డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలను జీహెచ్ఎంసీ పరిధిలో నిలిపివేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మద్యం విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆయా పార్టీల శ్రేణులతో పాటు మందుబాబులు సైతం ముందుగానే మద్యం విక్రయించేందుకు క్యూ కడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరు నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది.
వ్యక్తిగతంగా ఒక్కో వ్యక్తికి అధికంగా మద్యం విక్రయాలు జరిపితే చర్యలు తీసుకోనున్నారు. ఆబ్కారీ అధికారులు మద్యం నిల్వలు, సరఫరాలపై ఇప్పటికే ప్రత్యేక నిఘా పెట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి గ్రేటర్ పరిధిలోకి మద్యం సరఫరా జరగకుండా ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పోలింగ్‌కు ఏ ఆటంకం తలెత్తకుండా, మద్యంతో ఓటర్లను ప్రభావితం చేయకుండా చూసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
Also Read : Best LIC Policies: 5 బెస్ట్ ఎల్ఐసీ పాలసీలు ఇవే.. మీరూ ఓ లుక్కేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe