Yadagirigutta Leaders Rejoins In Congress: మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో కాక రేపింది. మునుగోడు ఫలితం వచ్చాక కూడా అదే కంటిన్యూ అవుతోంది. నేతల పార్టీల మార్పు కొనసాగుతోంది. అయితే తాజాగా జరిగిన ఓ ఘటన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరువు తీసిందనే చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అత్యుత్సాహంతో కేటీఆర్‌కు ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయనే గులాబీ లీడర్లే చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగురిగుట్ట మున్సిపాలిటీకి చెందిన నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఇద్దరు ఎంపీటీసీలను తీసుకుని స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి మంత్రి కేటీఆర్‌ను కలిశారు. జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి కూడా వీళ్ల వెంటే ఉన్నారు. నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి కేటీఆర్. 


కౌన్సిలర్లు వాణి, అరుణ, మల్లేశ్, సరోజ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు భరత్ గౌడ్, నల్గొండ డీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు పద్మావతి, మౌనికకు టీఆర్ఎస్ కండువాలు కప్పారు. అయితే సాయంత్రానికే సీన్ మారిపోయింది. మంత్రి కేటీఆక్ సమక్షంలో కారు పార్టీలో చేరిన కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్లేట్ ఫిరాయించారు. తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఆలేరు కాంగ్రెస్ ఇంచార్జ్ బీర్ల అయిలయ్య సమక్షంలో తిరిగి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. 


యాదగిరిగుట్ట మున్సిపాలిటీ అభివృద్ధి, నిధుల గురించి చర్చిద్దామని చెప్పి ఎమ్మె ల్యే గొంగిడి సునీత .. మంత్రి కేటీఆర్ దగ్గరకు తీసు కెళ్లి బలవంతంగా టీఆర్ఎస్ కండువాలు కప్పారని కాంగ్రెస్ కౌన్సిలర్లు ముక్కెర్ల మల్లేశ్ యాదవ్, బిట్టు సరోజ చెప్పారు. ఎన్ని నిధులైనా ఇస్తాం.. మీరు తమ వెంట ఉండాలని కేటీఆర్ చెప్పారని తెలిపారు. చర్చల కోసం ప్రగతి భవన్‌లోని ఓ హాల్ లోకి తీసుకెళ్లారని, తమ సెల్ ఫోన్లు లాక్కొని స్వి చ్ఛాఫ్ చేసి.. తాము వద్దంటున్నా బలవంతంగా తమ మెడలో టీఆర్ఎస్ కండువాలు కప్పారని చెప్పారు. తాము కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని స్పష్టంచేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ బీర్ల అయిలయ్యను కలిసి జరిగిన విషయాన్ని వివరించారు. 


మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన కౌన్సిలర్లు.. కొన్ని గంటల్లోనే మళ్లీ పార్టీ మారడం  అధికార టీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపింది. ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి తీరుతో మంత్రి కేటీఆర్ పరువు పోయే పరిస్థితి వచ్చిందని స్థానిక టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: Coronavirus Cases: మళ్లీ భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ నగరాల్లో లాక్‌డౌన్  


Also Read: Coronavirus Cases: మళ్లీ భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ నగరాల్లో లాక్‌డౌన్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook