Ys Sharmila Delhi Tour: ఏపీ ఎన్నికల ముందు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైపోయింది. ఇవాళ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజున షర్మిల ఢిల్లీ పర్యటన ఈ సందర్భంగా చర్చనీయాంశమౌతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి వైఎస్సార్టీపీని తెలంగాణ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాల్సి ఉండింది. కానీ కొన్ని పరిణామాల వల్ల నిలిచిపోయింది. ఇప్పుడు ఏపీ ఎన్నికల ముందు పార్టీ విలీనానికి రంగం సిద్ధమైంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకు బేషరతుగా మద్దతిచ్చిన వైఎస్ షర్మిల త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజున వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటించనున్నారు. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో సమావేశం కానున్నారని సమాచారం. ఏపీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటి చేస్తుంటే ప్రతిపక్షాలు టీడీపీ-జనసేన కూటమిగా బరిలో దిగనున్నాయి. ఇక ఏపీలో కనీసం ఉనికి చాటుకునేందుకు అధికార, ప్రతిపక్షాలకు గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలికి సమాలోచన చేస్తోంది. 


ఇందుకోసం వైఎస్ షర్మిలను రంగంలో దించి లబ్ది పొందాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఆమెను జాతీయ స్థాయిలో ఏఐసీసీలో సర్దుబాటు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏపీలో కాంగ్రెస్ ఉనికి చాటుకోవాలంటే ఆమె తప్పనిసరి అని పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే వైఎస్ షర్మిలను పార్టీలో చేర్చుకుని కీలక బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఏపీ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ-జనసేన కూటమికి గట్టి పోటీ ఇచ్చేందుకు వైఎస్ షర్మిల కీలక భూమిక వహించవచ్చనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచనగా ఉంది. 


ఇవాళ వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటనలో పార్టీలో చేరే విషయం, ఆమె నిర్వహించాల్సిన పాత్ర వంటి వివరాలు చర్చకు రావచ్చని తెలుస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ కండువా కప్పుకోవచ్చు.


Also read: Jagananna Vidya Deevena: సంక్షేమ పధకాలపై ముఖ్యమంత్రి జగన్ కలెక్టర్లతో సమీక్ష, రేపు జగనన్న విద్యా దీవెవ విడుదల



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook