Jagananna Vidya Deevena: మరో నాలుగు నెలల్లో ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ముందస్తుగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ కలెక్టర్లతో వివిధ సంక్షేమ పధకాలపై సమీక్ష జరపనున్నారు. రేపు భీమవరం నుంచి జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేయనున్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఫిబ్రవరి మొదటి రెండో వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావచ్చు. ఏప్రిల్ మొదటి వారంలో ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో కీలకమైన సంక్షేమ పథకాలపై ఏపీ ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా జనవరి నెల నుంచి మూడు వేల రూపాయలకు పెన్షన్ పెంపు, చేయూత, ఆసరా పథకాల అమలుపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పథకాల అమలు, లబ్దిదారుల భాగస్వామ్యం అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రానున్న మూడు నెలల్లో సంక్షేమ పధకాల పరంగా లబ్దిదారులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.
మరోవైపు రేపు డిసెంబర్ 29వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి భీమవరం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్దుల తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
జనవరి నెల నుంచి ఇచ్చే 3 వేల రూపాయల పెన్షన్ కార్యక్రమాన్ని ఓ పండుగలా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సంక్షేమ పథకాల్ని మరింత పగడ్బందీగా ప్రజల్లో తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook