YS Sharmila: తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల విమర్శలు ఎక్కుపెట్టారు. రాజకీయ పార్టీ ప్రకటనతో సంచలనం రేపిన షర్మిల వివిధ వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్బంగా తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎవరికీ తక్కువ కాదని..శతాబ్దాలుగా ఆ విషయం నిరూపించుకున్నారని వైఎస్ షర్మిల(Ys Sharmila) తెలిపారు. తెలంగాణ గడ్డ రాజకీయాలకు అడ్డా అని అన్నారు. త్వరలో పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల ప్రపంచ మహిళా దినోత్సవం సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ (Telangana) సమాజం‌ మహిళల ప్రాతినిధ్యం ఎంత ఉందని ప్రశ్నించారు. అసమానతలు గెలిచి సాధించుకున్న రాష్ట్రంలోనే అసమానతలున్నాయని వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో మహిళలు ఘోరంగా అన్యాయమయ్యారని షర్మిల అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసినవారిలో సగం మంది మహిళలేనని గుర్తుంచుకోవాలన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత గానీ, ప్రాతినిధ్యం గానీ ఎంతని తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశారు. మహిళల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం(Telangana government)ఘోరంగా విఫలమైందన్నారు. చట్ట సభల నుంచి ఉద్యోగావకాశాల వరకూ సంక్షేమ  కార్యక్రమాల నుంచి సమాజంలో గుర్తింపు వరకూ మహిళలకు నిర్ధిష్ట కోటా ఉండాల్సిందేనన్నారు. 


వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Ys Rajasekhar reddy) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు మంత్రులుగా అవకాశం కల్పించారని..కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మహిళకు మంత్రి పదవి ఇచ్చేందుకు ఐదేళ్ల సమయం పట్టిందన్నారు. జనాభాలో సగం మంది మహిళలే అయినప్పుడు ప్రాతినిధ్యం వహించడంలో మహిళలు లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఓవరాల్‌గా తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ స్థాపించిన తరువాత ప్రభుత్వంపై విమర్శల ధాటి ఇంకెలా ఉంటుందో అనే చర్చ ప్రారంభమైంది.


Also read: Telangana Mlc Elections: పీవీ కుమార్తె సురభి వాణికి ఎంఐఎం మద్దతు ఉండదా..కారణాలేంటి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook