Ys Sharmila on Kcr: తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పీడ్‌ పెంచారు. వరుస కార్యక్రమాలతో ప్రజలకు దగ్గర అవుతున్నారు. ఇప్పటికే ఆమె రెండు విడతలుగా పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో అడుగడుగునా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్‌ టార్గెట్‌గా విమర్శలు సంధిస్తున్నారు. తాజాగా మరోమారు సీఎం కేసీఆర్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మళ్లీ సీఎం అయితే రాష్ట్రం నాశనమవుతుందన్నారు. కేసీఆర్‌కు ఓటు వేస్తే భవిష్యత్‌ మిమ్మల్ని క్షమించదని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కేసీఆర్‌ను మళ్లీ నమ్మి ఓటు వేస్తే భవిష్యత్‌  తరాలు క్షమించరని చెప్పారు. పాలకులు మంచి వాళ్లు ఐతే ప్రజలు చల్లగా ఉంటారన్నారు. వైఎస్ఆర్‌ లాంటి నాయకత్వం కోసమే పార్టీ పెట్టానని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఆ నాయకులంతా మళ్లీ టీఆర్ఎస్‌లోకి వెళ్తారని వైఎస్ షర్మిల తెలిపారు.


బీజేపీకి ఓటు వేస్తే మతతత్వ రాజకీయాలు చేస్తుందన్నారు. ఇప్పటివరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. విభజన హామీల ఊసే లేదని విమర్శించారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మాట ఏయ్యిందని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తమ పార్టీని దీవిస్తే వ్యవసాయాన్ని పండుగలా మారుస్తామన్నారు. ప్రతి పేద కుటుంబానికి మహిళల పేరు మీద ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.


అధికారంలోకి రాగానే తొలి సంతకం ఉద్యోగాల కల్పనపైనే చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది వృద్ధులు ఉంటే అందరికీ పెన్షన్ ఇస్తామన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీల అభివృద్ధి కోసం పని చేస్తామని షర్మిల చెప్పారు. తెలంగాణ సంక్షేమ కోసం అనుక్షణం పనిచేస్తామని..ఒక్క అవకాశం ఇవ్వాలని పిలుపు ఇచ్చారు. ఓసీల్లో ఎంతో మంది పేదలు ఉన్నారని..వారిని ఆదుకుంటామన్నారు.


Also read: Ante Sundaraniki : నాని 'అంటే సుందరానికీ' నుంచి ట్రైలర్ గ్లింప్స్ విడుదల..!


Also read:Dancing With Crocodile: మొసలితో రొమాంటిక్ డ్యాన్స్ వీడియో వైరల్.. వాడిది ఏం గుండెరా బాబు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook