YS Sharmila Comments: కేసీఆర్ మంచం కోళ్లు ఎత్తుకు పోయే రకం! పాదయాత్రలో వైఎస్ షర్మిల ఫైర్..

YS Sharmila Comments: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుటూ ముందుకు సాగుతున్నారు. గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న షర్మిల.. టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.

Written by - Srisailam | Last Updated : May 29, 2022, 02:49 PM IST
  • ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో షర్మిల పాదయాత్ర
  • కేసీఆర్ మంచం కోళ్లు ఎత్తుకు పోయే రకం- షర్మిల
  • ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ పెన్షన్లు- షర్మిల
YS Sharmila Comments: కేసీఆర్ మంచం కోళ్లు ఎత్తుకు పోయే రకం! పాదయాత్రలో వైఎస్ షర్మిల ఫైర్..

YS Sharmila Comments: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుటూ ముందుకు సాగుతున్నారు. గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న షర్మిల.. టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ ఊసరవెల్లి మాటలతో వరి విషయంలో రైతులు  దారుణంగా మోసపోయారని అన్నారు.  వరి వేయడం తెలంగాణ రైతులకు శాపంగా మారిందన్నారు షర్మిల. కేసీఆర్ చేతగానితనంతో  రైతులను బ్యాంక్ ల దగ్గర డీ ఫాల్టర్లు గా మిగిలిపోయారన్నారు. బ్యాంకర్లు రైతులను దొంగలుగా చూస్తున్నారు అన్నారు. కేసీఆర్ 8 ఏళ్ల పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.రైతుల ఆత్మహత్యల పాపం ముమ్మాటికీ కేసీఆర్ దే అన్నారు.

వైఎస్సార్ హయాంలో వ్యవసాయం లాభసాటి గా ఉండేదన్నారు షర్మిల. ముష్టి 5 వేల రూపాయలు ఇస్తే రైతులు కోటేశ్వర్లు అయిపోతారా అని ముఖ్యమంత్రిని నిలదీశారు. 5 వేలు ఇస్తేనే రైతులు కార్లలో తిరుగుతారా అని ప్రశ్నించారు. 25 వేల రూపాయలు ఇచ్చే పథకాలు బంద్ పెట్టి.. ముష్టిగా 5 వేలు ఇస్తూ కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని షర్మిల విమర్శించారు. విత్తనాల సబ్సిడీ లేదు.. ఎరువుల మీద సబ్సిడీ లేదు అన్నారు. రైతులకు భరోసాగా ఉంటే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారని షర్మిల అన్నారు. 60 ఏళ్లు దాటితే నే బీమా అని రైతు నుదుటి మీద మరణ శాసనం రాస్తున్నారని మండిపడ్డారు. టీఆరెఎస్ అధికారంలోకి వచ్చాకా  8 ఏళ్లలో ఏ కుటుంబానికి న్యాయం జరిగిందో చెప్పాలన్నారు.

పెన్షన్లు కూడా సమయానికి ఇవ్వని కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి అవసరమా అని షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ మంచం కోళ్లు ఎత్తుకు పోయే రకమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఉద్యమ కారుడు కదా అని రెండు సార్లు అధికారం ఇస్తే నెత్తిన టోపీ పెట్టారని విమర్శించారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ వస్తారని చెప్పారు. బీసీ బందు, ఎస్టీ బంద్ అంటాడేమో.. ఎవరూ మోసపోవద్దని షర్మిల సూచించారు. పరిపాలన చేతకాక కేసీఆర్ రాష్ట్రం మీద 4 లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే తెలంగాణలో బాగుపడిందన్నారు. వైఎస్సార్ సంక్షేమ పాలన కోసమే పార్టీ పెట్టానన్నారు షర్మిల. నమ్మకంగా సేవ చేస్తా అని మాట ఇచ్చారు. వ్యవసాయాన్ని పండుగ చేస్తా... రైతును రారాజు చేస్తా.. భారీగా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ పెన్షన్లు ఇస్తామంటూ సంచలన ప్రకటన చేశారు వైఎస్ షర్మిల. 

READ ALSO: Tax Increase: ఇదేం బాదుడయా సీఎం! గుట్టుచప్పుడుకాకుండా ట్రాన్స్ పోర్ట్ ట్యాక్స్ హైక్

READ ALSO: Osmania University: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఓయూ.. ఆరుగురు అరెస్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News