Ante Sundaraniki : నాని 'అంటే సుందరానికీ' నుంచి గ్లింప్స్ విడుదల.. ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది..!

Ante Sundaraniki Movie update: నాని 'అంటే సుందరానికీ..' సినిమా నుంచి  ట్రైలర్​ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ట్రైలర్ అప్డేట్ ను ప్రకటించింది చిత్రబృందం.   

Edited by - ZH Telugu Desk | Last Updated : May 30, 2022, 03:49 PM IST
Ante Sundaraniki : నాని 'అంటే సుందరానికీ' నుంచి గ్లింప్స్ విడుదల.. ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది..!

Ante Sundaraniki Movie update: నేచురల్ స్టార్ నాని (Nani), మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ (Nazriya Nazim) జంటగా నటించిన చిత్రం 'అంటే సుందరానికీ..' ((Ante Sundaraniki). వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించిన చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది చిత్రయూనిట్. అందులో భాగంగా తాజాగా ట్రైలర్ గ్లింప్స్ (Ante Sundaraniki Trailer Glimpse)ను షేర్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ట్రైలర్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఈ చిత్ర ట్రైలర్ ను జూన్‌ 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 

ఇప్పటికే ఈ సినిమా రిలీజైన టీజర్, సాంగ్స్ కు విపరీతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా ఒక బ్రాహ్మణ యువకుడికీ, క్రిస్టియన్ అమ్మాయికి మధ్య నడిచే లవ్ స్టోరీగా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. నాని ఇతర సినిమాలకొస్తే... కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో 'దసరా' అనే చిత్రంలో నటిస్తున్నాడు నాని. ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో నాని తెలంగాణ యువకుడి పాత్రలో నటించనున్నారు. ఈ మూవీ ఈ ఏడాది చివర్లో రిలీజయ్యే అవకాశం ఉంది. 

Also Read: Major Movie Promotion: సినిమా టికెట్ కోసం క్యూలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News