Grorgia:  జార్జియాలోని ఓ ఇండియన్ రెస్టారెంట్లో విషాదం నెలకొంది. పగలంతా కష్టపడి పనిచేసి అలసిపోయిన సిబ్బంది అక్కడ నిద్రిస్తూ మరణించారు. ఈఘటనలో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులు పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరి మరణానికి కారణం ఏంటో తెలుసుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జార్జియాలోని గౌడౌరి స్కై రిసార్ట్ చాలా ఫేమస్. అక్కడ చాలా దేశాలకు చెందిన రెస్టారెంట్స్ ఉన్ానయి. అందులో ఒకటి ఇండియన్  రెస్టారెంట్ కూడా ఉంది. అయితే ఈ రెస్టారెంట్లో పలు దేశాలకు చెందిన 11 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఓ జార్జియన్ కూడా పనిచేస్తున్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేసే వీరు అలసిపోయి రాత్రి 11గంటలకు నిద్రిస్తుంటారు. ఆరోజు కూడా అలాగే నిద్రించారు. వారంతా ఉదయం అవుతున్నా లేవలేదు. ఎంతసేపటికి సిబ్బంది రాకపోవడంతో రిసార్ట్ సిబ్బంది వారి గదికి వెళ్లారు. 


వారంతా అక్కడే పడుకోవడం చూసి వారిని నిద్రలేపారు. కానీ వారు ఎంతటికి లేవలేదు. అనుమానం వచ్చి చూడగా వారంతా మరణించి కనిపించారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన సిబ్బంది వెంటనే పోలీసులు సమాచారం అందించారు. ఘటనాస్ధలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీలను పోస్టు మార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారంతా నిద్రలోనే మరణించినట్లు గుర్తించారు. 


Also Read: Gold Rate Today: లక్కీ ఛాన్స్.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధర.. సంక్రాంతి పండగ కంటే ముందే  కొనేయ్యండి   


వారి ఎవరూ హత్య చేయలేదని..వారి డెడ్ బాడీలపై ఎలాంటి గాయాలు లేవని  నిర్ధారణకు వచ్చాయి. అయితే ఆ 12 మంది మరణించడానరికి కారణం ప్రాథమిక విచారణలో గుర్తించారు. వీరంతా పడుకున్న సమయంలో కరెంట్ పూచింది. వాళ్లలో ఒకరు జనరేటర్ ఆన్ చేయగా..అది రాత్రంతా నడుస్తూనే ఉంది. అయితే వీరు నిద్రిస్తున్న గది చిన్నది కావడంతో అంతా చీకటిగా ఉంది. దీంతో జనరేటర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వెలువడింది. అది గది మొత్తం వ్యాపించింది. అది పీల్చిన సిబ్బంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. 


అయితే జార్జియా క్రిమినల్ కోడ్ చట్టం 116 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది నిర్లక్ష్యం వల్లే సంభవించే మరణాలని తెలిపింది. పోస్టు మార్టం రిపోర్టులు వచ్చాక..జనరేటర్ నుంచి వచ్చిన విషవాయువులే వారి మరణానికి కారణమా లేదా మరేదైనా కారణం ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. 


Also Read: Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న 3 రోజులు ఏపీలో భారీ వర్షాలు


 


 



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.