14 Killed In Boat Fire In Indonesia: ఇండోనేషియాలో ఘోర దుర్ఘటన సంభవించింది. దక్షిణ ఇండోనేషియాలో  సోమవారం 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవలో మంటలు చెలరేగి... 14 మంది మృతి చెందారు. 226 మందిని రెస్క్యూ టీమ్ రక్షించినట్లు నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'KM ఎక్స్‌ప్రెస్ కాంటికా 77' పడవ తూర్పు నుసా టెంగ్‌గారా ప్రావిన్స్‌లోని కుపాంగ్ నుండి కలాబాహి వైపు వెళ్తుండగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో (Indonesian passenger boat fire) పడవలో 230 ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 


గతంలో..
17,000 కంటే ఎక్కువ ద్వీపాలతో కూడిన ఇండోనేషియాలో (Indonesia) ఫెర్రీ మరియు పడవ ప్రమాదాలు సర్వసాధారణం, ఇక్కడ రవాణా కోసం తరుచుగా పడవలను ఉపయోగిస్తారు. 2018లో ఉత్తర సుమత్రా ప్రావిన్స్‌లోని లోతైన అగ్నిపర్వత బిలం సరస్సులో సుమారు 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీ మునిగి 167 మంది మృత్యువాతపడ్డారు. ఇండోనేషియాలో జరిగిన విషాద ఘటనల్లో 1999 పడవ ప్రమాదం ఒకటి. ఈ ప్రమాదంలో 332 మందితో వెళ్తున్న ఓడ మునిగిపోయింది. ఈఘటనలో 20 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.


Also Read: Rishi Sunak: బ్రిటన్ పీటంపై భారతీయుడు.. ఒక్క అడుగు దూరంలో..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook