Rishi Sunak: బ్రిటన్ పీటంపై భారతీయుడు.. ఒక్క అడుగు దూరంలో..!

Britain Elections 2022: బ్రిటన్‌ రేసులో రిషి సునాక్ దూసుకుపోతున్నారు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ రేసు నుంచి తప్పుకోవడంతో సునాక్ గెలుపు దాదాపు ఖారారు అయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 24, 2022, 12:26 PM IST
Rishi Sunak: బ్రిటన్ పీటంపై భారతీయుడు.. ఒక్క అడుగు దూరంలో..!

Britain Elections 2022: బ్రిటన్‌ పీటంను మన భారతీయుడు అధిరోహించే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ అందరికంటే ముందు దూసుకుపోతున్నారు. పోటీ రసవత్తరంగా సాగుతున్న అనుకుంటున్న సమయంలో మాజీ ప్రధాని  బోరిస్ జాన్సన్ పోటీ నుంచి తప్పుకోవడంతో రిషి సునక్ గెలుపు దాదాపు ఖారారు అయింది. తాను రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత జోన్సన్ ప్రకటించారు.

రిషి సునక్‌కు ఇప్పటివరకు 131 నుంచి 153 మంది ఎంపీలు మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది. బోరిస్ జాన్సన్‌కు 56 నుంచి 76 మంది, పెన్నీ మోర్డాంట్‌కు 22 నుంచి 28 మంది ఎంపీలు ఉన్నారు. 100 లేదా అంతకంటే ఎక్కువ మంది ఎంపీల నామినేషన్లు ఉన్న అభ్యర్థులు మాత్రమే మొదటి బ్యాలెట్‌లోకి ప్రవేశిస్తారు. సోమవారం సాయంత్రం వరకు గడువు ఉంది. రిషి సునక్‌కు 100 కంటే ఎక్కువ ఎంపీల మద్దతు ఉండడంతో ఆయన ఎన్నిక లాంఛనమే..!

పోటీకి అవసమైన ఎంపీల మద్దతు తనకు ఉందంటూ బోరిస్ జాన్సన్ రాజీనామా సమయంలో తెలిపారు. తనకు 102 సభ్యుల సపోర్ట్ ఉందని చెప్పారు. కానీ నిజానికి ఆయనకు అంతమంది సభ్యులు మద్దతు తెలపకపోవడంతోనే పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కన్జర్వేటివ్ పార్టీని ఐక్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని చెప్పారు బోరిస్ జాన్సన్. సునాక్, మరో పోటీదారు పెన్నీ మోర్డాంట్‌ను ఒప్పించడంలో తాను విఫలమయ్యానంటూ చెప్పుకొచ్చారు.

రిషి సునాక్‌కు ఎంపీల సపోర్ట్ రోజురోజుకూ పెరుగుతోంది. ఆయనకు దాదాపు 150 మంది ఎంపీల మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. తీవ్ర సంక్షోభంలో ఉన్న బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానని రిషి సునాక్ చెబుతున్నారు. 

కరోనా సమయంలో తాను చేసిన సేవల గురించి వివరిస్తున్నారు. తనకు అవకాశం కల్పించాలని కన్వర్వేటివ్‌ పార్టీ సభ్యులను కోరుతున్నారు.

జాన్సన్ రేసు ఔట్ అవ్వడంతో సునాక్‌, పెన్నీ మోర్డాంట్‌ మధ్యే ప్రధాని పదవికి పోటీ నెలకొంది. బ్రిటన్‌ కొత్త ప్రధాని ఎన్నిక ప్రక్రియ మొదలుకావడంతో.. తాము ఎవరికి సపోర్ట్ చేస్తున్నామో  ఈ-మెయిల్స్ లేదా నేరుగా నామినేషన్స్‌ను సోమవారంలోగా నామినేషన్లు సమర్పించాలి. ప్రధానిగా పోటీ చేసే అభ్యర్థికి కనీసం 100 మంది ఎంపీల మద్దతు ఉండాలి. అలా అయితేనే రేసులో ఉంటారు. ఇద్దరు అభ్యర్థులకు 100 మందికి పైగా సభ్యులు మద్దతు ఇస్తే.. పార్టీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొంటారు. 

Also Read: Anushka Sharma - Virat Kohli : అన్ని పరిస్థితుల్లోనూ ప్రేమిస్తుంటా.. అనుష్క శర్మ ఎమోషనల్ పోస్ట్

Also Read:Rohit - Kohli: హ్యాట్సాఫ్ విరాట్‌ కోహ్లీ.. భారత అత్యుత్తమ నాక్‌లలో ఇది ఒకటి: రోహిత్‌ శర్మ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News