Shocking: 14 ఏళ్లకే తల్లైన రష్యా అమ్మాయి..10 ఏళ్ల అబ్బాయే తండ్రట
13 సంవత్సరాలకే గర్భవతి! ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి అవడానికి కారణం 10 సంవత్సరాల పిల్లాడు అని చెబుతోంది.
రష్యాకుచెందిన దరియా సూడ్నిష్నికోవా ( Daria Sudnishnikova ) ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ సమయంలో ఆమె వయసు ఎంతో తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. ఆమె 13 సంవత్సరాలకే గర్భవతి అయింది. 14 సంవత్సరాలకు తల్లి అయింది. ఈ విషయం తెలియగానే ప్రపంచం ( World ) మొత్తం షాక్ అయింది. అయితే అంతకన్నా పెద్ద షాకింగ్ న్యూస్ మరోటి చెప్పింది దరియా. ఈ బిడ్డకు తండ్రి అయిన ఇవావ్ వయసు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే అని చెబితే ప్రపంచం మొత్తం ముక్కున వేలేసుకుంది. ప్రస్తుతం అతని వయసు 11 సంవత్సరాలు అని తెలిపింది.
అయితే వైద్యులు మాత్రం దరియా తండ్రి విషయంలో మరో అభిప్రాయం చెబుతున్నారు. 11 సంవత్సరాల చిన్నారి దరియా బిడ్డకు తండ్రి కాకపోయి ఉండవచ్చు అని.. మరో వ్యక్తి అయి ఉండవచ్చు అని చెబుతున్నారు. 14 సంవత్సరాలకే తల్లి అయిన దరియా కాస్త మెచూర్ అయిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన చిన్నారి సంరక్షణ విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకుంటోంది అని తెలిపారు. అంత చిన్న వయసులో తల్లి అవడం వల్ల దరియా చాలా ఒత్తిడికి గురి అవుతోంది అని వైద్యులు చెబుతున్నారు. దాంతో ఆమెను విశ్రాంతి తీసుకోమని తెలిపారట.
రష్యా ( Russia ) నియమాల ప్రకారం గార్డియన్ అవ్వడానికి కనీస వయసు 18 సంవత్సరాలు. అంటే బిడ్డ సంరక్షకులుగా ఉండాలి అంటే దరియా మరో నాలుగు సంవత్సరాలు, ఇవాన్ మరో 7 సంవ్సరాలు బిడ్డ ఆలనా పాలన చూసుకోవడానికి వేచి ఉండాల్సి ఉంటుంది. తను తల్లి విషయం గురించి తెలిపిన దరియా.. ఇవాన్ తనను బలవంత పెట్టాడు అని అలా తల్లిని అయ్యాను అని చెబుతోంది. అయితే అప్పుడు భయపడటం వల్ల ఎవరికిరీ చెప్పలేదు అని తెలిపింది. అయితే కొత్త తన ఎదురింట్లో ఉంటున్న 16 సంవత్సరాల బాయ్ ఫ్రెండ్ తనపై అత్యాచారం చేశాడు అని చెబుతోంది. పోలీసులు ఈ వ్యవహారంలో దర్యాప్తు నిర్వహించి ఢీఎన్ ఏ టెస్ట్ చేసి విషయం తేల్చుతాం అన్నారు.