Stampede: అక్కడ ఫుడ్ ఈవెంట్ జరుగుతోంది. భోజనంతో పాటు మంచి మంచి బహుమతులు అందిస్తామని నిర్వాహకులు ప్రచారం చేశారు. ఇంకేం జనాలు పోటెత్తారు. తిండి, గిఫ్టుల కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. వాళ్లను కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. దీంతో తొక్కిసలాట జరిగింది. 31 మంది దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది చిన్నారులే. మంచి భోజనం దొరుకుతుందని ఆశపడి వచ్చిన పిల్లలు.. తొక్కిసలాటలో చిక్కుకుని విగతజీవులుగా మారిపోయారు. ఈ విషాద ఘటన నైజీరియాలోని ఓ చర్చీలో జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణ నైజీరియాలోని పోర్ట్ హార్​కోర్ట్​ పట్టణంలోని ఓ చర్చ్ స్థానిక పోలో క్లబ్ లో డొనేషన్ డ్రైవ్ నిర్వహించింది. ఈ కార్యక్రమం కోసం భారీగా ప్రచారం చేశారు. ఆహారంతో పాటు మంచి గిఫ్టులు ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. దీంతో చర్చీ దగ్గరకు జనాలు భారీగా తరలివచ్చారు. ఫుడ్, గిఫ్టులు తీసుకునేందుకు క్యూలో నిలబడ్డారు. అయితే డొనేషన్ డ్రైవ్ నిర్వహకుల అంచనా కంటే భారీగా ప్రజలు అక్కడికి వచ్చారు. దీంతో పంపిణి కష్టంగా మారింది. అదే సమయంలో క్యూలో నిల్చున్న జనాలు అసహనానికి లోనయ్యారు. తమ వంతు వరకు వస్తుందా రాదా అన్న ఆందోళనతో.. ఒక్కసారిగా ముందుకు ఎగబడ్డారు.


జనం ఒక్కసారిగా ముందుకు వచ్చారు. చాలా మంది గేట్లు పగలగొట్టుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో క్యూలెన్లలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 31 మంది స్పాట్ లోనే ప్రాణాలు వదిలారు. గాయపడిన ఏడుగురిని చికిత్స కోసం హాస్పిటల్ తరలించారు.  ఘటనపై సమాచారం రాగానే అక్కడికి వెళ్లిన పోలీసులు.. పరిస్థితిని కంట్రోల్ చేశారు. తొక్కిసలాట జరిగే సమయానికి ఇంకా బహుమతుల పంపిణి ప్రారంభం కాలేదని నైజీరియా సివిల్ డిఫెన్స్ కార్ప్స్ ప్రతినిధి ఒలుఫెమి అయోదెలె చెప్పారు. గేటు మూసి ఉన్నా లోపలికి వెళ్లేందుకు ఎగబడటంతో తొక్కిసలాట జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్థు చేస్తున్నారు. సరైన వసతులు లేకుండా డొనేషన్ డ్రైవ్ నిర్వహించిన నిర్వాహకులపైనా కేసు నమోదు చేశారు.


READ ALSO: NewBrew Beer: మార్కెట్లోకి కొత్త బీర్ బ్రాండ్... మూత్రం, డ్రైనేజీ నీళ్లతో తయారీ...


READ ALSO: TDP Mahanadu: క్విట్ జగన్-సేవ్ ఆంధ్రప్రదేశ్‌..మహానాడు వేదికగా చంద్రబాబు పిలుపు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook