Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ రణం ముగిసింది. ఆ నేల ఇప్పుడు మరోసారి తాలిబన్ల వశమైంది. దేశంలో పరిణామాలు వేగంగా మారుతుండటంతో ఆంక్షలు ప్రారంభమయ్యాయి. ఆఫ్ఘన్ గగనతలం ఇప్పుడు ప్రయాణ నిషిద్దమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆప్ఘనిస్తాన్‌ను(Afghanistan)పూర్తిగా వశపర్చుకున్నారు తాలిబన్లు. ఆఫ్ఘనిస్తాన్ సైనికులకు తాలిబన్లకు మధ్య గత కొద్దిరోజులుగా జరుగుతున్న యుద్ధం ముగిసింది. తాలిబన్లు (Talibans)దేశంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆఫ్ఘన్‌లో ఇప్పుడు పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అందుకే అక్కడ ఆంక్షలు అమలవుతున్నాయి. కొత్తగా ఆఫ్ఘన్ గగనతలాన్ని ప్రయాణ నిషిద్ధంగా ప్రకటించారు కాబూల్ విమానాశ్రయ అదికారులు. ఆప్ఘన్ గగనతలం ఆర్మీకు బదిలీ అయినందున..ఇకపై ఏ విధమైన విమానాలు ప్రయాణించకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. అలా ప్రయాణిస్తే అనియంత్రితంగా పరిగణిస్తామని కాబూల్ ఎయిర్‌పోర్ట్ అధికారులు పైలట్లకు హెచ్చరిక జారీ చేశారు. తదుపరి ప్రకటన చేసేవరకూ కాబూల్ విమానాశ్రయాన్ని(Kabul Airport) మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ఫలితంగా చాలాదేశాలు ఆఫ్ఘన్‌కు విమాన సర్వీసులు రద్దు చేసుకున్నాయి. ఎయిర్‌ఇండియా, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వంటి సంస్థలు ఇతర మార్గాల ద్వారా విమానాలు నడిపాయి. ఇటు ఎయిర్ ఇండియా సైతం ఢిల్లీ- కాబూల్ సర్వీసు రద్దు చేసుకుంది. 


Also read: Ashraf Ghani: అశ్రఫ్ ఘనీ 4 కార్లు, హెలీక్యాప్టర్ నిండా డబ్బుతో పారిపోయాడా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook