అమెరికా అధ్యక్ష ఎన్నికలు ( America president Elections ) సమీపిస్తున్న తరుణంలో షాకింగ్ వార్త వెలువడింది.  పేలుడు పదార్ధాలు తీసుకెళ్తూ పట్టుబడిన యువకుడు..విచారణ సందర్బంగా వెల్లడించిన విషయాలు సంచలనంగా మారాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో వారం రోజుల వ్యవధి మిగిలుంది. ఈ తరుణంలో నార్త్ కరోలినా పోలీసుల ( North Carolina police ) విచారణలో వెల్లడైన నిర్ఘాంతపరిచే విషయాలు వెలుగుచూశాయి. సంచలనం కల్గిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ  ( Democratic party candidate ) అభ్యర్ధిగా పోటీ చేస్తున్న జో బైడెన్ ( Joe biden ) హత్యకు పధకం రచించారా..19 ఏళ్ల యువకుడు బైడెన్ ను హతమార్చాలనుకున్నాడా..పోలీసులు చెబుతున్న వివరాలు అవుననే అంటున్నాయి. ఈ ఏడాది మే 28వ తేదీన నార్త్ కరోలినా పోలీసులు అలెగ్జాండర్ హిల్లెల్ ట్రెయిన్మన్ ను పేలుడు పదార్ధాల కేసులో అరెస్టు చేశారు.  ఓ వ్యాన్ ను దొంగిలిస్తున్న సందర్భంగా ట్రెయిన్ మన్ అరెస్టయ్యాడు. ఆ వ్యాన్  శోధించగా..అందులో  5 లక్షల 9 వేల డాలర్ల నగదు, బాంబులు, ఆయుధాల తయారీకు సంబంధించిన పుస్తకాలు, స్వస్తికా డ్రాయింగ్స్‌, భవనాల్లో కూలిపోతున్న విమానాలకు సంబంధించిన ఫోటోలు,  ఏఆర్‌ రైఫిల్, 9 మిమీ లుగర్,  కెల్-టెక్ సబ్ -2000,  22 - క్యాలిబర్ రైఫిల్ ను గుర్తించారు. 


ఇక పోలీసులు జరిపిన విచారణలో ట్రెయిస్‌మన్‌ షాకింగ్ అంశాల్ని తెలిపాడు. తనకు ఉగ్రవాద సంఘటనలు, సామూహిక కాల్పులపై ఆసక్తి ఉందన్నాడు. తనను ద్వేషించేవారిని అంతం చేయడం.. మాస్‌ షూటింగ్‌ చేయాలనే కోరిక ఉన్నట్లు వెల్లడించాడు. అదే విధంగా జో బైడెన్‌ని ( Plan to kill joe Biden ) చంపాలనుకున్నట్టు తెలిపాడు. ఇందులో భాగంగా..ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు  జో బైడెన్‌ ఇంటి అడ్రెస్‌, స్టేట్‌ గన్‌ చట్టాలు, రైఫిల్‌ పార్ట్స్‌, నైట్‌ విజన్‌ గాగుల్స్‌ గురించి సెర్చ్‌ చేశానన్నాడు. మరోవైపు మే నెలలో డెలావేర్‌లోని బైడెన్‌ ఇంటికి నాలుగు మైళ్ల దూరంలో తిరిగినట్టు చెప్పాడు. సంబంధిత పోలీసు రికార్డులు ఇదంతా నిజమని నిర్థారించాయి కూడా. అంతటితో ఆగలేదు.  ఇదే ఏడాది ఏప్రిల్‌ 15న ఐ ఫన్నీ అనే ప్లాట్‌ఫామ్‌లో నేను జో బైడెన్‌ని చంపుతానా అనే మిమ్‌ని కూడా షేర్‌ చేశాడు. న్యూ హాంప్‌షైర్‌లో ట్రెయిస్‌మాన్ ఒక ఏఆర్‌-15 రైఫిల్‌ను కొనుగోలు చేసి..ఎగ్జిక్యూట్ అనే పదంతో ముగిసే చెక్‌లిస్ట్ నోట్‌ను కూడా రాసుకున్నాడట.


వేరే కేసులో అరెస్టయ్యాడు కాబట్టి సరిపోయిందని..లేకపోతే ఏం చేసి ఉండేవాడో ఊహిస్తేనే ఆందోళన కలుగుతుందని నార్త్ కరోలినా పోలీసులు వెల్లడించారు. అయితే ఇప్పుడు ఎన్నికలకు వారం రోజులున్న సమయంలో ఈ విషయం ఒక్కసారిగా వెలుగుచూడటమే ప్రాధాన్యత సంతరించుకుంది. Also read: FATF: వచ్చే యేడాది వరకూ పాకిస్తాన్ ఆ జాబితాలోనే