H1B Visa issue: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ భారతీయ ఐటీ నిపుణులకు శుభవార్త అందించారు. బాధ్యతలు చేపట్టగానే ట్రంప్ ఇమ్మిగ్రేషన్ చట్టాల్ని రద్దు చేస్తామని ప్రకటించారు. ముఖ్యంగా హెచ్1 బీ వీసాలపై ఆంక్షల్ని తొలగిస్తామనడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( America president Donald trump ) ప్రవేశపెట్టిన ఇమ్మిగ్రేషన్ చట్టం, హెచ్1బీ వీసాలపై ఆంక్షలు భారతీయ ఐటీ నిపుణుల్ని ఇబ్బందుల్లో నెట్టాయి. చాలామంది ఉద్యోగాలు కోల్పోగా..మరి కొంతమంది వీసా రెన్యువల్ కాక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధి జో బిడెన్ విజయం సాధించడంతో ఐటీ పరిశ్రమ చాలా ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు జో బిడెన్ ఐటీ నిపుణుల ఆశల్ని చిగురించేలా ప్రకటన చేశారు.  


అధ్యక్షుడిగా బాద్యతలు చేపట్టగానే ట్రంప్ తెచ్చిన ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని ( Immigration Law ) రద్దు చేస్తామని..హెచ్ 1బీ వీసాల ( H1B Visa )పై ఆంక్షల్ని తొలగిస్తామని వెల్లడించారు. 2021 మార్చ్ వరకూ ఉన్న నిషేధాన్ని రద్దు చేయడమే కాకుండా..నిబంధనల్లో సవరణలు తీసుకురానున్నారు. కొత్త ఇమ్మిగ్రేషన్ బిల్లు ( New Immigration Bill ) ను పరిశీలన కోసం కమిటీకు పంపించనున్నారు. హెచ్1బీ వీసాల్లో లాటరీ విధానానికి జో బిడెన్ స్వస్తి చెప్పనున్నారని తెలుస్తోంది. లాటరీ విధానానికి స్వస్తి చెప్పి..ఆ స్థానంలో వేతనాలు, నైపుణ్యానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సైన్స్, మేథమేటిక్స్, పీహెచ్ డీ చేసిన వారికి గ్రీన్‌కార్డు ( Green card ) ఇచ్చే ఆలోచన ఉంది. జనవరి 20న అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బిడెన్ ( Joe Biden ) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అధ్యక్షుడిగా బాథ్యతలు చేపట్టిన తొలిరోజున పారిస్ వాతావరణ ఒప్పందంలో తిరిగి చేరనున్నట్టు కూడా బిడెన్ తెలిపారు. 


Also read: Indonesia flight incident: సముద్రం కూలింది జావా సముద్రంలోనే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook