Joe Biden First Sign: అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం..అనంతరం ముందుగా జో బిడెన్ ఏం చేయబోతున్నారు..ఏ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ముస్లిం దేశాలపై ట్రంప్ విధించిన ఆంక్షల పరిస్థితి ఏంటి..ఇప్పుడివే ఆసక్తి కల్గించే అంశాలుగా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బిడెన్ ( America 46th president Joe Biden ) ప్రమాణ స్వీకారం చేసిన కాస్సేపటికే..అంటే తొలి గంటల్లో ఏం చేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది. కొత్త అధ్యక్షుడిగా జో బిడెన్ తీసుకునే ఆదేశాలేంటి. ముందుగా 15 ఉత్తర్వులపై ( Joe Biden first 15 orders to sign ) సంతకాలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా పారిస్ ఒప్పందం ( Paris agreement ) లో తిరిగి పాల్గొనడం, వంద రోజుల వరకూ తప్పనిసరిగా మాస్క్ ధరించడం వంటి ఆదేశాలున్నాయి. ఇవి కాకుండా ముస్లిం దేశాలపై ట్రంప్ హయాంలో విధించిన ఆంక్షల్ని రద్దు చేసే ఆదేశాలపై సంతకాలు చేయనున్నారు. 


అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్ ( Joe Biden )..మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) తీసుకున్న కొన్ని విధానాల్ని రద్దు చేయనున్నారు.  అధ్యక్షుడిగా కొత్త ఇమ్మిగ్రేషన్ బిల్లును తీర్మానించడం తొలి నిర్ణయాల్లో ఒకటని వైట్‌హౌస్ ( White house ) వర్గాలు తెలిపాయి. జో బిడెన్ తొలిరోజే చారిత్రాత్మకమైన పని చేయనున్నారని..వైట్‌హౌస్ ప్రెస్ కార్యదర్శి తెలిపారు. మొత్తం 15 నిర్ణయాలపై ఆదేశాలు వెలువరించనున్నారని చెప్పారు. 


Also read: Kamala Harris: కమలా హ్యారిస్ సొంతూరిలో సంబరాలు, ప్రత్యేక పూజలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook