Kamala Harris: కమలా హ్యారిస్ సొంతూరిలో సంబరాలు, ప్రత్యేక పూజలు

Kamala Harris: అమెరికా తొలి మహిళ శ్వేతేతర ఉపాధ్యక్షుడురాలిగా కమలా హ్యారిస్ ( Kamala Harris ) విజయంతో ఇండియాలో కూడా ఆనందం పెల్లుబుకుతోంది. కమలా హ్యారిస్ సొంతూరైన తమిళనాడులోని తులసేంద్రపురం ( Thulasendrapuram ) లో ప్రజలు బాణాసంచా కాల్చి..మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.

  • Jan 20, 2021, 20:31 PM IST

Kamala Harris: అమెరికా తొలి శ్వేతేతర ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఊరిలో పండుగ వాతావరణం నెలకొంది. ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే ఆమె ఊర్లో ప్రత్యేక పూజలు  చేసి..మిఠాయిలు కాల్చి వేడుక జరుపుకున్నారు. 

1 /6

తులసేంద్రపురం ఊర్లోవాళ్లంతా చేతుల్లో కమలా హ్యారిస్ పోస్టర్లు పట్టుకుని ఉన్నారు. ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటున్నారు. చారిత్రాత్మక సందర్బంపై శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. బాణాసంచా కాల్చి వేడుక జరుపుకున్నారు. 

2 /6

తులసేంద్రపురం ఊరిలో మహిళలు కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక కావడంపై దక్షిణ భారతదేశపు ప్రత్యేక యాగం నిర్వహించారు. కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక కావడమనేది దేశంలోని మహిళలందరికీ గొప్ప విషయమని ఊరి మహిళలంటున్నారు. 

3 /6

కమలా హ్యారిస్ అమెరికా చరిత్రలో ఉపాధ్యక్షురాలైన తొలి మహిళ...అంతేకాకుండా తొలి శ్వేతేతర, తొలి ఆసియా అమెరికన్ పౌరురాలు కూడా. అధ్యక్షుడి తరువాత రెండవ అత్యున్నత పదవి అమెరికాలో ఇదే. 

4 /6

కమలా హ్యారిస్ తల్లి భారతీయురాలు కాగా..తండ్రి జమైకాకు చెందినవారు. ఇద్దరూ చదువు కోసం అమెరికా వెళ్లారు. అక్కడే ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. కమలా హ్యారిస్ 5 ఏళ్ల వయస్సులో ఇండియాకు వచ్చారు. ఆ సందర్బంగా తన తాతయ్యతో చెన్నై బీచ్‌ ( Chennai Beach ) లో తిరిగారు. 

5 /6

కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం ( Kamala Harris oath taking ceremony ) కంటే ముందే తులసేంద్రపురం ( Thulasendrapuram )  గ్రామం సంబరాల్లో మునిగింది.  జనం ఆలయానికి చేరుకున్నారు. కమలా హ్యారిస్ విజయం, భారత అమెరికా సంబంధాలు మెరుగుపడాలని ప్రత్యేక పూజలు చేశారు ఊరి ప్రజలు. 

6 /6

తమిళనాడు ( Tamil nadu ) లోని చెన్నై నుంచి దాదాపు 320 కిలోమీటర్లు దక్షిణాన తులసేంద్రపురం  ( Kamala Harris ) ఊరుంది. దాదాపు వందేళ్ల క్రితం ఇదే ఊర్లో కమలా హ్యారిస్ తాతయ్య జన్మించారు. ఆ తరువాత కమలా హ్యారిస్ తల్లి కూడా ఇదే ఊరిలో జన్మించారు. ( Kamala Harris native place Thulasendrapuram )