US Transgenders Remove From Militery: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ట్రంప్.. పరిపాలన పరమైన కొన్ని సంచలన నిర్ణయాలను తీసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామిల మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ కోవలో అమెరికా మిలటరీలో కీలకంగా ఉన్న ట్రాన్స్‌జెండర్లను తొలగించే దిశగా చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. దీంతో ఆ కమ్యూనిటీలో భయాందోళనలు నెలకొంటున్నాయి. ప్రస్తుతం అమెరికా మిలిటరీలో దాదాపు 15 వేల మంది ట్రాన్స్‌జెండర్లు విధులు నిర్వర్తిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్రంప్‌ తన మొదటి పాలనలో కూడా ట్రాన్స్‌జెండర్లు సాయుధ దళాల్లో చేరకుండా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అప్పటికే మిలిటరీలో పనిచేస్తున్న వారిని కొనసాగించారు. ప్రస్తుతం మిలిటరీలో పని చేస్తున్నవారిని కూడా తొలగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జనవరి 20న ప్రమాణ స్వీకారం చేసిన రోజునే  జారీ చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే పలు యూనివర్సీటీలు వేరే చోట ఉన్న తమ విద్యార్ధులను జనవరి 20 లోపు అమెరికాకు  రావాలని కోరుతున్నాయి.


అయితే.. ట్రంప్ మాత్రం..ముందుగా సాయుధ దళాలను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. సాయుధ దళాల్లో మహిళలు, లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తులను చేర్చుకోవడం వల్ల భద్రత క్షీణిస్తోందంటున్నారు. దీనివల్ల దేశ రక్షణకు ముప్పు వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్ దీనిపై స్పందిస్తూ కళాశాలల్లో ప్రవేశం కోసం కొంతమంది టీనేజర్లు లింగమార్పిడి చేయించుకుంటున్నారని అన్నారు. హార్వర్డ్‌, యేల్‌ లాంటి విద్యాసంస్థల్లో చోటు సంపాదించాలంటే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి పిల్లలకు ఇదే మార్గంలా కనిపిస్తోందన్నారు.


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter