అగ్రరాజ్యం అమెరికా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వణికిపోతోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. గురువారం ఒక్కరోజులోనే...3 వేలకు పైగా మరణించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా సెకండ్ వేవ్ ( Corona second wave ) కూడా అమెరికాను వదలడం లేదు తొలిదశలో కూడా అత్యధిక కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. ఇప్పుడు సెకండ్ వేవ్ అమెరికా ( America )లో చాప కింద నీరులా విస్తరిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. మరీ ముఖ్యంగా మరణాలు పెద్ద ఎత్తున సంభవిస్తున్నాయి. 18 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా..2 లక్షల 10 వేల మందికి వైరస్ సంక్రమించినట్టు నిర్ధారణైంది. అమెరికాలో ఇప్పటి వరకూ 1 కోటి 50 లక్షల మంది వైరస్ బారిన పడగా..2 లక్షల 86 వేల 249 మంది మృతి చెందారు. 


త్వరలోనే కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) అందుబాటులో రానున్న నేపధ్యంలో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే వ్యాక్సిన్ అందుబాటులో వచ్చేలోగా వేలాదిమంది మరణించడం ఆందోళన కల్గిస్తోంది. ఎందుకంటే గురువారం ఒక్కరోజులోనే 3 వేల 54 మంది కోవిడ్ కారణంగా మృతి చెందారు. ఈ ఏడాది చివరి నాటికి 20 మిలియన్ల మందికి..జనవరి నాటికి 50 మిలియన్ల మందికి..తొలి త్రైమాసికం నాటికి 100 మిలియన్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని అమెరికా నిర్ణయించుకుంది. 


Also read: Covid-19 Vaccine: తమ డ్రైవర్లకు ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాలని కోరిన ఉబర్