H1B Visa: అగ్రరాజ్యం అమెరికాలో నిపుణులైన ఉద్యోగుల కొరత సమస్యగా మారింది. విదేశీ నిపుణుల అవసరం ఏర్పడింది. అందుకే ఇప్పుడు హెచ్ 1 బీ వీసాలపై చర్చ నడుస్తోంది. హెచ్ 1 బీ వీసాల సంఖ్యను రెట్టింపు చేయాలనే డిమాండ్ విన్పిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికా(America)లో గతంలో ఉన్న ట్రంప్ ప్రభుత్వం(Trump Government) విదేశీ ఉద్యోగాలపై నియంత్రణ విధించే క్రమంలో భాగంగా హెచ్ 1 బీ వీసాల జారీలో ఆంక్షలు విధించారు. దేశీయంగా ఉద్యోగాల కల్పన కోసం ట్రంప్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. అయితే అమెరికాలో ఇప్పటికీ నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత మాత్రం రానురానూ తీవ్రమౌతోంది.ఇదే పరిస్థితి కొనసాగితే దేశ ఆర్ధిక వ్యవస్థకు నష్టం వాటిల్లనుందనేది యూఎస్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్(US Chambers of Commerce) వాదనగా ఉంది. అందుకే తక్షణం దేశంలో ప్రొఫెషనల్ వర్కర్స్‌ను నియమించుకోవాలని సూచిస్తోంది. వెంటనే విదేశీ వృత్తి నిపుణుల్ని రప్పించుకోవల్సిన అవసరం ఏర్పడింది. విదేశీ నిపుణుల్ని రప్పించేందుకు హెచ్ 1 బీ వీసాల(H1B Visa) సంఖ్యను రెట్టింపు చేయాలని జో బిడెన్( Joe Biden) ప్రభుత్వానికి, పార్లమెంట్‌కు విజజ్ఞప్తి చేసింది.


ప్రస్తుతం ఉద్యోగ ఆధారిత వీసాల్ని ప్రతి యేటా 1 లక్షా 40 వేలమందికి ఇస్తున్నారని..ఈ సంఖ్యను 2 లక్షల 80 వేలకు పెంచాలని యూఎస్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ కోరుతోంది. గ్రీన్‌కార్డుల(Green Cards) జారీ విషయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న దేశాలవారీ కోటా పద్ధతిని తొలగించాలని కోరింది. 


Also read: Nuclear Weapons: కశ్మీర్ సమస్యకు అణ్వాయుధాలకు సంబంధమేంటి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook